Moviesఅబ్బబ్బా..ఏం టేస్ట్ కొరటాల నీది.. NTRకి అక్కగా ఆ స్టార్ హీరో...

అబ్బబ్బా..ఏం టేస్ట్ కొరటాల నీది.. NTRకి అక్కగా ఆ స్టార్ హీరో సిస్టరా..? హిట్ కొట్టావ్ పో..!!

ఇది నిజంగా మంచు అభిమానులకు పిచ్చెక్కించే గుడ్ న్యూస్ అని చెప్పాలి . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ కనపడిన ట్రోల్ చేసేవారు . అయితే ఈ మధ్యకాలంలో ఆ ట్రోలింగ్ కాస్త తగ్గింది . దానికి కారణం మంచు లక్ష్మి అనే చెప్పాలి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉండడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది.

తనను ట్రోలింగ్ చేసే జనాలకు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తుంది . అనగనగా ఒక ధీరుడులో తనదైన నటన ప్రతిభను చూపించి అందరి చేత శభాష్ అనిపించుకున్న మంచు లక్ష్మి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది . అయితే ఇప్పటివరకు తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఆమె వద్దకు రాలేదు . అయితే ఫస్ట్ టైం ఓ బడా సినిమాలో ఆఫర్ కొట్టేసింది . అది కూడా పాన్ ఇండియా సినిమాలో కావడం గమనార్హం .

ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కి అక్కరోల్ లో మంచు లక్ష్మి తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో అక్క క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ . ఓవైపు పాజిటివ్ మరోవైపు నెగిటివ్ షేద్స్ కలగలిసిన ఈ పాత్రకు మంచు లక్ష్మిది పర్ఫెక్ట్ అంటూ ఎన్టీఆర్ ను చూస్ చేశారట . ఈ సినిమాలో ఈ పాత్ర చాలా చాలా కీలకంగా మారబోతుందట. ఈ పాత్ర సినిమాకి హైలైట్ కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే మాత్రం మంచు లక్ష్మి కెరియర్ ఇక సెట్ అయినట్టే దశతిరిగిపోయినట్టే అంటున్నారు నందమూరి అభిమానులు . దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news