ఈ మధ్యకాలంలో ఇది ఓ ట్రెండ్ గా మారిపోయింది. ఒక సినిమా చేస్తున్న టైంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం .. ఆ ముచ్చట తీరిపోయాక విడాకులు తీసుకోవడం మళ్ళీ మరొక హీరోతో ప్రేమాయణం నడుపుతూ ..ప్రేమకి అంతులేదు.. అడ్డులేదు అని నాన్న రకాలుగా డైలాగ్స్ చెప్పడం . ఎక్కువగా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి . క్రమక్రమంగా అది టాలీవుడ్లోకి పాకేసింది . ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే విడాకుల తర్వాత ఎవరి దారి వారిది అంటూ బ్రతికేస్తున్న ఈ హీరో హీరోయిన్ సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్కి గురవుతూనే ఉంటారు . కాగా రీసెంట్గా ఆ హీరోయిన్ తో మరో స్టార్ హీరో ప్రేమాయణం నడుపుతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . అంతేకాదు ఆ హీరోయిన్ సైతం అతడితో మింగిల్ అవ్వడానికి రెడీ అంటుందట .
రీసెంట్గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా అలానే అనిపిస్తుంది . దీంతో ఆ హీరో పై మండిపడుతున్నారు సదరు హీరోయిన్ ఫ్యాన్స్. గతంలో ఆ హీరో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించినట్లు నటించి మోసం చేశాడు అన్న వార్తలు వైరల్ అయ్యాయి . ముచ్చటగా మూడోసారి ఈ బ్యూటీతో మాటలు కలుపుతూ మింగిల్ అవుతూ ఉండడంతో ఫాన్స్ కడుపు రగిలిపోతుంది . అందుకే ఆ కడుపు మంటలో భారీ డైలాగ్స్ కొడుతున్నారు. ఇలాంటి పనికిమాలిన ఐడియాలు నీకే ఎలా వస్తాయి బ్రో అంటూ కడుపులోని బాధను ఫన్నీగా నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . ఇప్పటికే ఆ హీరో హీరోయిన్లు ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..?