Moviesమూడు రాత్రుల్లు నిద్రపోనీకుండా ఆమెను టార్చర్ చేసిన డైరెక్టర్.. బన్నీకి ...

మూడు రాత్రుల్లు నిద్రపోనీకుండా ఆమెను టార్చర్ చేసిన డైరెక్టర్.. బన్నీకి చెప్పి ఏడ్చేసిన జెనీలియా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కొన్ని కొన్ని సార్లు తమకు నచ్చని పాత్రలను పోషిస్తూ ఉండాలి. అంతేకాదు తమకు కోపం తెప్పించిన సరే కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొన్ని సినిమాల్లో నటించాల్సి ఉంటుంది . అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ జెనీలియా . జెనీలియా గురించి అందరికీ తెలిసిందే .. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న మనిషి . అందుకే తెలుగు హీరోలు ఆమెను దూరం పెట్టేశారు. మరి ముఖ్యంగా జెనీలియా అనగానే అందరికీ హాసిని గుర్తొస్తుంది.

బొమ్మరిల్లు సినిమాల్లో నటించి క్రేజీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న జెనీలియా .. ఈ సినిమా తరువాత తన తలరాతను ఎలా మార్చేసుకుందో మనకు తెలిసిందే . అయితే ఈ సినిమాలో ఓ సీన్ చేయడానికి డైరెక్టర్ నానా తండాలు పడ్డారట . జెనీలియా కరెక్ట్ గా డైలాగ్ చెప్పకపోవడం దానికి తోడు క్లైమేట్ సహకరించకపోవడంతో డైరెక్టర్ ఈ సీన్ ని ఏకంగా మూడు రోజులు షూట్ చేశారట.

అర్ధరాత్రి సిద్ధార్థతో ఐస్క్రీమ్ తినడానికి వెళ్తుంది జెనీలియా. ఈ సీన్లో సరిగ్గా నటించని కారణంగా డైరెక్టర్ ఏకంగా మూడు రోజులు ఆమెను రాత్రులు నిద్రపోనికుండా ఇదే షూట్ ని కంటిన్యూ చేశారట . దీంతో కోపం పీక్స్ కి వెళ్ళిపోవడంతో జెనీలియా డైరెక్టర్ పై అరిచి నువ్వు వద్దు నీ సినిమా వద్దు అంటూ వెళ్ళిపోయిందట. రెండు రోజులు షూటింగ్ కి కూడా రాలేదట . ఆ తర్వాత మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయిన అల్లు అర్జున్ ఆమె కోపాన్ని కూల్ చేసి సినిమాలో నటించమంటూ చెప్పుకొచ్చారట . బన్నీ అంటే ఎంతో ఫ్రెండ్షిప్ ఉన్న జెనీలియా బన్నీ కోసమే ఈ సినిమాలో నటించింది . ఆ తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయి ఆమె కెరీర్ ని ఎలా టర్న్ చేసిందో మనకు తెలిసిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news