సినిమా ఇండస్ట్రీ అంటే అంతే,, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . ఇది జరుగుతుంది అని గెస్ చేస్తే ఖచ్చితంగా అది జరగదు .. అలాంటి సీన్స్ మనం ఎన్నో తెరపై చూసాం . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో రామలక్ష్మణుల లాంటి ఎన్టీఆర్ కల్యాణ్‌రామ్ మధ్య కూడా వార్ మొదలైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ . మొన్నటి వరకు ఈ సినిమా ఒకటే పార్ట్ ఉంది అని.. అంతా అనుకున్నారు. కానీ రీసెంట్గా కొరటాల ఈ సినిమాని రెండు పార్ట్ లు గా తెరకెక్కిస్తున్నామంటూ అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు.
ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నాడు కళ్యాణ్ రామ్ . నిజానికి కళ్యాణ్‌రామ్ కి ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించడం ఇష్టం లేదట . ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పారట . కానీ కొరటాల శివ మాత్రం కళ్యాణ్ రామ్ చెప్పిన పాయింట్ ని పరిగణలోకి తీసుకోలేదు అంటూ తెలుస్తుంది . కళ్యాణ్ రామ్ ఎంత చెప్తున్నా సరే వినకుండా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం అని ఫిక్స్ అయిపోయి .. ఆయన పర్మిషన్ లేకుండానే వీడియో రిలీజ్ చేశారట .
అంతేకాదు కళ్యాణ్‌రామ్ ఇష్టంగా మాత్రం ఈ సినిమాకు డబ్బులు పెట్టడం లేదు అంటూ స్పష్టంగా అర్థం అవుతుంది . ఎందుకంటే ఇప్పుడు కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలు ఎలా డుంకీ కొడుతున్నాయో తెలిసిందే . పైగా రాజమౌళి తర్వాత డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో జనాలు కూడా ఈ సినిమాపై కొత్త డౌట్లు వ్యక్తం చేస్తున్నారు . అలాంటిది రెండు భాగాలుగా తెరకెక్కించడం అంటే కష్టమే .కళ్యాణ్ రామ్ ఆలోచన నిజమే కానీ ఎందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు..? కొరటాల ఎన్టీఆర్ ని మార్చేశాడా ..? అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి . మొత్తానికి కొరటాల పెట్టిన చిచ్చు ఎన్టీఆర్ కళ్యాణ్‌రామ్ మధ్య బాగానే పేలింది..!!