టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం ఈ ముద్దుగుమ్మ ఇప్పుడే పెళ్లి చేసుకోదు అని భావించిన ప్రతి హీరోయిన్ రీసెంట్ కాలంలో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవడం గమనార్హం. తాజాగా శృతిహాసన్ సైతం అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అంటూ తెలుస్తుంది.
కొద్దిరోజుల ముందు శృతిహాసన్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను . ఇది టాప్ సీక్రెట్ కానీ ఈ సీక్రెట్ ను నేను ఎక్కువ కాలం దాచలేను అంటూ చెప్పుకొచ్చింది. అందరూ ఇది పెళ్లి గురించి అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు .సంతాను హజారికాను ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా శృతిహాసన్ జ్వరంతో ఫ్లూ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది .
“దేవుడా ప్లీజ్ ప్లీజ్ నాకు డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి.. ఇది డెంగ్యూ అయితే కాకూడదు.. అక్టోబర్ 26 వరకు నాకు ఈ సింటమ్స్ లేకుండా చూడు ..ప్లీజ్ అంటూ చెప్పుకు వచ్చింది”. దీంతో అక్టోబర్ 26 ఆమె లైఫ్ లో మోస్ట్ స్పెషల్ డే అని ..ఆరోజు అభిమానులకి మంచి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది ఇది కచ్చితంగా శృతిహాసన్ ఎంగేజ్మెంట్ డేట్ అంటున్నారు . అది చాలా మంచి ముహూర్తం అని ఆ తేదీన చాలామంది పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారని ..అదే డేట్ నా శృతిహాసన్ నిశ్చితార్ధం అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు . మొత్తానికి అసలు ఈ టాప్ సీక్రెట్ ఏంటో తెలియాలి అంటే అక్టోబర్ 26 వరకు ఆగాల్సిందే..!