మాస్ మహారాజ్ రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాకు హీరోయిన్ సమస్య వెంటాడుతోంది. ఇటీవల కాలంలో రవితేజకు సరైన హీరోయిన్ సెట్ కావటం లేదు. రవితేజ నటించిన ధమాకా సినిమాకు తప్పితే మిగిలిన సినిమాలకు హీరోయిన్లు సరిగా సెట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే మైనస్ అయ్యారు కూడా..! అందుకే ఆ సినిమాలు అన్నీ డిజాస్టర్లు అయ్యాయి. ఇప్పుడు గోపీచంద్ మలినేని – మైత్రీ మూవీస్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలా ? అని తర్జనభజనలు పడుతున్నారు మేకర్స్.
ముందుగా రష్మికను అనుకున్నారు. ఆమె డేట్లు సెట్ కావడం లేదు. చివరకు కృతిశెట్టిని తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమె తమిళ సినిమాలు చేస్తూ ఉండడంతో ఆమె డేట్లు కూడా అటు ఇటు ఉన్నాయి. చివరకు ధమాకా హిట్ కాంబినేషన్ శ్రీలీలను తీసుకోవాలని అనుకున్నారు. శ్రీలీల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫుల్ బిజీ. ఆమె చేతిలో ఏకంగా డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ధమాకా హిట్ కాంబినేషన్ కదా..!
మరోసారి రవితేజ పక్కన నటించమని దర్శకనిర్మాతలు ఆమెను రిక్వెస్ట్ చేశారట. నాతో సినిమా తీయాలనుకుంటే మరో ఏడాది పాటు నా డేట్లు ఖాళీ లేవు.. ఆ తర్వాత చేద్దామని సింపుల్ గా చెప్పి తప్పించుకుందట. శ్రీలీల ఇచ్చిన ఆన్సర్ తో ఈ క్రేజీ ప్రాజెక్టు మేకర్స్ కు దిమ్మ తిరిగిపోయినంత పని అయిందట.
ఏది ఏమైనా టాలీవుడ్లో శ్రీలీల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. మామూలుగా కృతి శెట్టిని హీరోయిన్గా తీసుకోవచ్చు.. అయితే ఆమెను కాస్త లేటుగా అప్రోచ్ అవడంతో ఆమె కొన్ని తమిళ సినిమాలకు కమిట్ అయింది. అందుకే ఇప్పుడు రవితేజ సినిమా కోసం హీరోయిన్ను వెతకడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది.