Movies"అసలు ఆ విషయం బాలకృష్ణకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాను"..శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

“అసలు ఆ విషయం బాలకృష్ణకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాను”..శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఆమె రీసెంట్గా నటించిన సినిమా భగవంత్ కేసరి .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా కూతురి పాత్రలో శ్రీ లీలా కనిపించబోతుంది . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

దసరా కానుకగా అక్టోబర్ 19 ఈ సినిమా రిలీజ్ కాబోతోంది . ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ లీల ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ ఇంటర్వ్యూలో సినిమాలతో పాటు తన పరసనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది . ఇలాంటి క్రమంలోనే బాలయ్య పై చాలా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ” నేను డాక్టర్ చదువుతున్నాను అని బాలయ్య కి కూడా తెలుసు. నేను ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు .. లేదా ప్రాక్టికల్స్ కి వెళ్లి వచ్చినప్పుడు..

సార్ నా దగ్గర నుంచి అన్ని విషయాలు అడిగి కనుక్కుంటారు.. నేను ఆన్సర్ చెప్పే దానికంటే ముందే ఆయన ఆన్సర్ చెప్పేస్తారు ..అప్పుడు నేను అనుకునేదాన్ని ఈయన మెడికల్ చదవలేదు కదా ..ఇవన్నీ ఎలా తెలుసు..? అని నేను చాలా ఆశ్చర్యపోయాను .. ఆయన సీనియర్ ఆయనకు అన్నీ తెలుసు అని అప్పుడే అర్థమైంది ..ఆయనతో నటించడం చాలా చాలా హ్యాపీగా ఉంది ..ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ..నేను ఈ సినిమాలో ఆయన్ని ఎక్కువగా చిచ్చా అంటూ పిలుస్తాను ..నిజంగానే నాకు ఆయన చిచ్చా “అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news