సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పేరే ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అంతేకాదు రీసెంట్ గా శ్రీ లీల “మ్యాడ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయింది . ఆమెతోపాటు సిద్దు జొన్నలగడ్డ – దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ గా హాజరయ్యారు . ఇదే క్రమంలో శ్రీ లీల స్పీచ్ అందరిని ఆకట్టుకుంది .
మరి ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ను ఓ రేంజ్ లో పొగిడేసింది. శ్రీలీల మాట్లాడుతూ..” సార్ మీకు ఒక విషయం చెప్పాలి ..ఈ కార్యక్రమానికి మీరు వస్తున్నారు అని చెప్పినప్పుడు నాకన్నా మా అమ్మ సంతోషంగా ఫీల్ అయిపోయింది .. మిమ్మల్ని అడిగానని చెప్పమనింది .. నాకు చిన్నప్పటినుంచి ఒక కల వచ్చేది .. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు గుర్రం మీద వచ్చే యువరాజుని ఊహించుకున్నాను. ఎప్పుడైతే మీ “హిరయి” పాట చూశానో,, అప్పటినుంచి నా కలలో వచ్చే రాజకుమారుడు మీరే అని ఫిక్స్ అయిపోయాను .. ఇక్కడికి నా కలలో మీరు వస్తూనే ఉంటారు సార్ “అంటూ చాలా చిలిపిగా మాట్లాడింది .
అంతేకాదు శ్రీ లీల చిలిపి మాటలకు దుల్కర్ కూడా చిన్నగా నవ్వుతూ ధన్యవాదాలు చెప్పాడు . అంతేకాదు శ్రీలీల స్టేజిపై మాట్లాడిన మాటలు అభిమానులను బాగా అట్రాక్ట్ చేశాయి. దీంతో కొందరు జనాలు “అంటే నీ బెడ్ రూమ్ లోకి వచ్చే ఆ చిలిపి రాకుమారుడు దుల్కర్ సల్మాన్ నేనా ..?”అంటూ అంటుంటే కలలోకి వచ్చి ఎలాంటి చిలిపి పనులు చేశాడు..? అంటూ మరికొందరు పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . ఇంకొందరు దుల్కర్ సల్మాన్ భార్యను గుర్తు చేస్తూ శ్రీ లీల జాగ్రత్త దుల్కర్ కు పెళ్లి అయిపోయింది ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో శ్రీ లీల స్పీచ్ వైరల్ గా మారింది..!!