Newsశోభన్ బాబు, కృష్ణకు రీప్లేస్ అనుకున్న ఆ నందమూరి హీరో ఇండ‌స్ట్రీ...

శోభన్ బాబు, కృష్ణకు రీప్లేస్ అనుకున్న ఆ నందమూరి హీరో ఇండ‌స్ట్రీ నుంచి ఎందుకు మాయం అయ్యాడు..!

తెలుగు చిత్ర పరిశ్రమల్లో నందమూరి కుటుంబం అంటే ఎంతో స్పెషల్ క్రేజ్ ఉంది. నందమూరి తారక రామారావు నట వారసులుగా ఆయన తర్వాత రెండో తరం హీరోలుల‌గా హరికృష్ణ, బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తే…జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటి వారు మూడో తరం హీరోలుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కోన్న‌సాగుతున్నారు. అయితే వీళ్లందరి మధ్యలో ఓ నందమూరి నటుడి ప్రస్థానం…చాలా ఆశల మధ్య మొద‌లై..అనుకోకుండా ముగిసిపోయింది. ఇంతకీ ఆ నందమూరి హీరో ఎవ‌రుంటే అతనే నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి.

1986లో కోడిరామకృష్ణ దర్శకత్వంలోని స్వాగతం సినిమాతో హీరోగా తెలుగు తెర‌కు పరిచయమైన నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమ్ రావు కొడుకే కళ్యాణ్ చక్రవర్తి. ఈయన తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే ఏడాదిలోని వరుసగా రెండు సినిమాలలో నటించాడు. ఇక ఆ తర్వాత ఏడాది వరుసగా నాలుగు సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2003లో కబీర్ దాస్ సినిమాలో చివరిసారిగా నటించాడు.

ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు కళ్యాణ్ చక్రవర్తి. ఇక దానికి కారణం చాలా వరకు ఎవరికి తెలియకపోగా ఆయన సన్నిహితులు కొందరు కొన్ని విషయాలు తెలిపారు. అలా ఒక పెద్ద హీరోగా మారిపోతాడు అనుకున్న కళ్యాణ్ చక్రవర్తి స్టోరీలో ఒక అనుకోని సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తూ, అతని కొడుకు పృధ్వి ఒక రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించారు. ఆ సంఘటన ఆయను తీవ్ర వేదనకి గురి చేయడంతో ఇక అప్పటినుంచి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదట.

అప్పట్లో చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమ మెల్లగా హైదరాబాద్ కి మారుతున్న సంధర్భంలో.. వాళ్ళ తండ్రి నందమూరి త్రివిక్రమరావు కూడా అదే స‌మ‌యంలో చనిపోయారట. ఇక దాంతో ఆయనకు హైదరాబాద్ వచ్చే ఆలోచన లేకపోవడంతో చెన్నైలో ఉన్న వారి వ్యాపారాలు చూసుకుంటూ సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఒకవేళ ఆయన సినిమాల్లోనే కొనసాగి ఉంటే మ‌త్రం నందమూరి కుటుంబం నుంచి ఒక పెద్ద స్టార్ గా టాలీవుడ్‌లో ఎదిగేవాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news