అఖండ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉంటుంది ? అనుకుంటారు.. అంచనాలు అదిరిపోతాయి. ఇటు రామ్ హీరో కచ్చితంగా రామ్ కెరియర్ లో మరో మరచిపోలేని మాస్ సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్కంద థియేటర్లోకి వచ్చింది. అంచనాలు అందుకోలేదు.. ఇంకా చెప్పాలి అంటే ఆ ఏరియా.. ఈ ఏరియా అన్న తేడా లేకుండా ఎక్కడా కూడా బ్రేక్ ఈవెన్ కు రాలేదు. సినిమా కొన్నవాళ్ళు ఎవరు సొమ్ములు చేసుకోలేకపోయారు.
ఇప్పటికే చాలా చోట్ల స్కంద సినిమాను ఎత్తేశారు. ఏ సెంటర్లో ఆడుతున్నా కుర్చీలు అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అనుకున్న దాని కంటే ముందే ఓటిటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుం.ది సినిమా రిలీజ్ అయిన 4 వారాలకే స్కంద ఓటిటిలో ప్రత్యక్షం కాబోతుందని సమాచారం. అంటే దీని అర్థం మేకర్స్ ఈ సినిమా ప్లాప్ అని ఒప్పుకున్నట్టేగా అన్న చర్చ టాలీవుడ్ లో వస్తోంది. ఈ సినిమా కంటే తాజాగా వచ్చిన నార్నె నితిన్ మ్యాడ్ సినిమా అదరగొడుతుంది.
ఏరియాలతో సంబంధం లేకుండా దూసుకుపోతోం.ది అంతర్గత చర్చల ప్రకారం రామ్ కూడా స్కంద సినిమా ప్లాప్ అని ఒప్పుకున్నాడట. సినిమాపై తాను చాలా అసలు పెట్టుకున్నానని ఆ రేంజ్ లో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని కాస్త ఫీలైనట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని సహజంగానే దర్శకుడు బోయపాటి ఒప్పుకోవట్లేదు. తన సినిమా అమోఘం.. సూపర్ హిట్ అంటున్నాడు.
ఆయన ఇంటర్వ్యూలలోను అదే చెబుతున్నాడు. మరి అంత సూపర్ హిట్.. అద్భుతం అనుకున్న సినిమాను నెల రోజులకే ఓటీటీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ? అన్నదే ఇప్పుడు బోయపాటికి తలెత్తుతున్న ప్రశ్న. ధియేటర్లలో బ్రహ్మాండంగా కలెక్షన్లు ఉన్నప్పుడు 30 రోజులకే ఓటీటీలో రిలీజ్ చేయరు కదా..! ఏది ఏమైనా స్కంద సినిమా బోయపాటి నుంచి వచ్చిన దమ్ము – వినయ విధేయ రామ తర్వాత మరో ప్లాప్ సినిమా అని చెప్పాలి.