టాలీవుడ్లో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ వాళ్లలో హిట్ట్ కొట్టి స్టార్ హీరోయిన్లు అయ్యేది మాత్రం ఒకరో, ఇద్దరో ఉంటారు. అలా గత ఏడాది రిలీజ్ అయిన సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్డం సంపాదించిన బ్యూటీ మృణాల్ ఠాగూర్. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న మృణాల్ అంటే తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు మృణాల్ విషయంలో టాలీవుడ్ బడా నిర్మాత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
తెలుగులో అగ్ర నిర్యాత అల్లు అరవింద్ గురించి అందరికీ తెలిసిందే. గీతా ఆర్ట్స్ తరఫున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించారు. అలాగే ఆయన ఆహా ఓటీటీ ఎన్నో సంచలనాలతో దూసుకుపోతోంది. అల్లు అరవింద్ గత ఏడాది హీరోయిన్ లావణ్య త్రిపాఠిని హైదరాబాద్ వచ్చై అమ్మాయి ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకో అని సరదాగా అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అదే నిజం అయింది.
అదే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్‌తో ఆమె ప్రేమలో పడటం నవంబర్ 1న పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లావణ్య పెళ్లి వరుణ్‌తో సెట్ అయినప్పుడు చాలా మంది అల్లు అరవింద్ ఆశీర్వాదం గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు అదే అల్లు అరవింద్ సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ని కూడా తెలుగింటి కోడలు కావాలని ఆశీర్వదించారు. సైమా అవార్సులో సీతారామమ్ సినిమాకు గాను మృణాల్ ఉత్తమ నట్టిగా ఎంపికయ్యారు. ఈ అవార్డ్‌ని అల్లు అరవింద్ ఆమెకు ప్రజెంట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓ వేదికపై హీరోయిన్ తో ఓ మాట అన్నాను. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కి కోడలిగా రమ్మన్నాను. ఆ మాట ఆ హీరోయిన్ నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా… తెలుగింటి కోడలిగా హైదరాబాద్ వచ్చెయ్ అని అల్లు అరవింద్ ఠాకూర్‌ని ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన మాట, సెంటిమెంట్ నిజం అయితే మృణాల్ ఠాకూర్ తెలుగింటి కోడలు అవుతుందని సరదాగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.