దామిని .. ఈ సూపర్ స్టార్ సింగర్ గురించి మనం ఎంత చెప్పుకున్న అది తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది . చిన్న ఏజ్ లోనే పాటలు పాడడం అలవాటు చేసుకున్న ఈ సింగర్ బాహుబలి సినిమాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పచ్చబొట్టేసిన సాంగ్ పాడింది . అంతేకాదు దీనికి సంబంధించి ఆమె ఎన్నో అవార్డులు కూడా అందుకుంది . ఈ పాటనే కాకుండా ఇండస్ట్రీలో ఎన్నెన్నో మంచి పాటలు పాడిన దామిని .. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చింది .
అయితే అందరిలా డబల్ గేమ్స్ ఆడలేక పోయిన దామిని హౌస్ నుంచి త్వరగా బయటకు వచ్చేసింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దామిని తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు సైతం షేర్ చేసుకుంది . మరీ ముఖ్యంగా ఆమె పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని ఖచ్చితంగా పెళ్లికి ముందు డేటింగ్ చేసే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
అంతేకాదు తన కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకొని డేటింగ్ చేస్తానని .. అప్పుడే లైఫ్ బాగుంటుందని.. ఇదే నా ఒపీనియన్ అంటూ చెప్పుకు వచ్చింది . అంతేకాదు పచ్చబొట్టే వేయించుకోవాలని చాలా కోరికగా ఉందని .. కానీ తనకి ఇష్టమైన ప్లేస్ లోనే వేయించుకోవడానికి చూస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది . దీనితో సింగర్ దామిని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!