ఇది నిజంగా అక్కినేని ఫ్యాన్స్ కు బాధాకరమైన వార్త అని చెప్పక తప్పదు. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నాగచైతన్య సమంతల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనకు తెలిసిందే. అయితే గత వారం రోజుల నుంచి సమంత చైతన్య మళ్ళీ కలిసిపోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ అదంతా అబద్ధమని సమంత చైతన్య కోసం వేయించుకున్న టాట్యూ ని సైతం తీసేసింది అని క్లారిటీ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అయితే సమంత మళ్లీ తన పాత బాయ్ ఫ్రెండ్స్ సిద్ధార్ధ్ తో చేతులు కలిపింది అన్న న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది .
రీసెంట్గా సిద్ధార్ధ్ నటించిన చిన్నా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాను చాలా మంది జనాలు లైక్ చేశారు. ఈ క్రమంలోనే సమంత సైతం సినిమాలో సిద్ధార్థ్ నటన చూసి డైరెక్టర్ అరుణ్ కుమార్ కు కాల్ చేసి మరి స్పెషల్ గా పొగిడేసిందట . అంతేకాదు సిద్ధార్ధ్ నటన ఈ సినిమాకి ప్లస్ అయింది అంటూ చెప్పుకొచ్చిందట.
ఆ విషయం తెలుసుకున్న సిద్ధార్ధ్ ఏకంగా 10 సంవత్సరాల తర్వాత మళ్లీ సమంతకు కాల్ చేసి మరీ మాట్లాడారు అన్న వార్త వైరల్ అవుతుంది . అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ మాటలు మొదలైతే అవి ఎంతవరకు వెళ్తాయి ..? ఒకవేళ నిజంగానే వీళ్ళ మధ్య మళ్ళి ప్రేమ చిగురించిందా..? పెళ్లి వరకు వెళ్తుందా..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు . మొత్తానికి సమంత ప్రవర్తిస్తున్న తీరు ఎవరికీ అర్థం కావడం లేదు..!!