Newsప్రియాంక చోప్రానే మించిపోయిన శృతీహాసన్.. బెడ్‌రూమ్ సీన్స్ సెగలు.. !

ప్రియాంక చోప్రానే మించిపోయిన శృతీహాసన్.. బెడ్‌రూమ్ సీన్స్ సెగలు.. !

తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బాగా ఆకట్టుకుంటున్న నటి శ్రుతి హాసన్. ఈ ముద్దుగుమ్మ “ది ఐ” సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించేందుకు ఆమె ఉత్సాహంగా ఉంది. అందుకే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చేసేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రంలో, ఆమె నటుడు మార్క్ రుఫెలో సరసన వైఫ్ గా నటిస్తోంది. శ్రుతిహాసన్ హాలీవుడ్‌లో తన మొదటి సినిమాలోనే ఒక సాహసపూరితమైన పాత్రలో కనిపించడం ఆసక్తిని రేపుతోంది.

ఈ సినిమాలో ఆమె తన చనిపోయిన భర్త అస్తికల్ని ఒక ద్వీపంలో కలిపేందుకు ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఈ మూవీలో భర్త మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆమె ఎలాంటి అవరోధాలు ఎదుర్కొందో చూడాలి. శ్రుతిహాసన్ ఈ పాత్రలో బాగా రొమాన్స్ కూడా చేసిందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె హీరోతో కలిసి నటించిన బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా మత్తెక్కిస్తాయని అంటున్నాయి.

క్వాంటికోలో బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా కదిలే కారులో ఎలాంటి రొమాన్స్ చేస్తుందో దానికి మించిన రొమాన్స్ శ్రుతిహాసన్ చేసిందని కొందరు అంటున్నారు. శ్రుతిహాసన్ ఈ సినిమాతో హాలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో ఈ అమ్మడు ఎన్ని హద్దులను చేరిపేస్తుందో చూడాలిక. శ్రుతి సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోయడంలో ఏమాత్రం వెనకాడదు.

ఒకవేళ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో సక్సెస్ అయితే కమల్ హాసన్ వారసత్వం గ్లోబెల్ లెవెల్ కి చేరుతుంది. ఇండియాలో ఈ ముద్దుగుమ్మ నటించే సినిమాలు దాదాపు హిట్స్ అవుతుంటాయి. హాలీవుడ్ లో కూడా అలాంటి లక్కు ఆమెకు లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే శ్రుతి హాసన్, మార్క్ రౌలీ జంటగా నటించిన అంతర్జాతీయ చిత్రం ది ఐ. ఇది డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫింగర్‌ప్రింట్ కంటెంట్ ద్వారా నిర్మించబడింది.

ఈ చిత్రం 1980 నాటి కథ ఇందులో కోలీవుడ్ తన భర్త మరణం వెనుక ఉన్న చీకటి రహస్యాలను కనుగొంటుంది. ఈ చిత్రం గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీకి, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమా 2023లో విడుదల కానుంది. శ్రుతిహాసన్ తెలుగులో “సలార్”, “హాయ్ నాన్న” సినిమాలలో కూడా నటిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news