ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఏం కొనుక్కున్న సోషల్ మీడియా పుణ్యమా..? అంటూ ఇట్టే బయటపడిపోతుంది. అత్యంత లగ్జరీ వస్తువులను కొనుక్కుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు కొందరు స్టార్ సెలబ్రెటీస్ . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది బాలీవుడ్ బ్యూటి శ్రద్ధా కపూర్ . విజయ దశమి సంధర్భంగా శ్రద్ధా కపూర్ లగ్జరీ కారుని సొంతం చేసుకుంది .
ఈ కారు కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2010లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ ఎలాంటి సినిమాలో నటించి హిట్ కొట్టిందో మనకు తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ క్రేజ్ దక్కించుకుంది . ఇలాంటి క్రమంలోనే మొదటి నుంచి కార్లు అంటే చాలా పిచ్చి ఉన్న శ్రద్ధా కపూర్ రీసెంట్గా కొన్ని కారు నేషనల్ వైట్ గా ట్రెండింగ్‌గా మారింది.
అత్యంత ఖరీదైన లంబోర్గిని హూరాకిన్ టెక్నిక మోడల్ కారుని శ్రద్దా దాస్ సొంతం చేసుకుంది. మార్కెట్ ధర ప్రకారం ఈ కారు కాస్ట్ దాదాపు నాలుగు కోట్ల పైమాటే అంటూ తెలుస్తుంది . అంటే శ్రద్ధా కపూర్ ఒక సినిమా చేస్తే తీసుకునే సగం రెమ్యూనరేషన్ అనమాట . శ్రద్ధా కపూర్ దాదాపు ఒక్కొక్క సినిమాకి 6 కోట్ల నుంచి 8 కోట్లు తీసుకుంటుంది . అలా శ్రద్ధా కపూర్ తన సొంత డబ్బులతో తన ఫేవరెట్ లంబోర్గిని హూరాకిన్ టెక్నిక మోడల్ కారుని కొనింది . ఈ విషయాన్ని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . దీంతో శ్రద్ధా కపూర్ కి సంబంధించిన ఈ పిక్చర్ వైరల్ గా మారింది . శ్రద్ధా కపూర్ తెలుగులో నటించిన ఏకైక సినిమా సాహూ. ప్రభాస్ సరసన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన వీళ్ళిద్దరి కాంబో మాత్రం బాగా ఆకట్టుకునింది..!!