మన టాలీవుడ్ హీరోలు చాలా తెలివైన వాళ్ళు అన్న నానుడి ఉంది. సినిమా హిట్లు.. ప్లాపులతో సంబంధం లేకుండా వీళ్ళు రెమ్యురేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. సినిమా జయాపజయాలతో నిర్మాతకు లాభం రావడం వీళ్ళకు ఏమాత్రం పట్టింపు ఉండదు. తమ డబ్బు చేతిలోకి వచ్చిందా ? లేదా అన్నదే వీళ్ళకు కావలసిన విషయం. ఒక సినిమా ప్లాప్ అయితే.. ఆ నిర్మాతను ఓదార్చేందుకు ఇంకో సినిమా చేస్తామని ఊరడిస్తారు… కానీ డేట్లు మాత్రం ఇవ్వరు. చాలామంది ఆ మాట మీద నిలబడరు. అది టాప్ స్టార్ అయినా.. మిడిల్ రేంజ్ హీరో అయినా అంతే..!
బాలకృష్ణ లాంటి ఒకరిద్దరు హీరోలు మాత్రమే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని నిర్మాతకు ఒక రూపాయి లాభం రావాలన్న ఆతృతతో ఉంటారు. ఇక ఎన్ని హీరో శర్వానంద్ చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మాతగా శర్వానంద్ మహాసముద్రం సినిమా చేస్తే డిజాస్టర్ అయింది. ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టాలు మిగిలింది. ఇది ఇలా ఉంటే సామజవరగమన సినిమాతో హిట్ కొట్టాడు కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజు. ఈ దర్శకుడు తర్వాత సినిమా కూడా అనిల్ సుంకరకే చేయాలి.
కానీ నిర్మాత ఆసియన్ సునీల్ తాను అదే డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తానని అనడంతో అనిల్ సుంకర ఓకే చెప్పారట. ఆసియన్ సునీల్ ఆ దర్శకుడిని నాగచైతన్య దగ్గరకు పంపారట. అక్కడ కథ సెకండాఫ్ ఓకే కాలేదు. దీంతో ఆదర్శకుడు హీరో శర్వానంద్ ని కలిసి కథ చెప్పి ఒప్పించుకున్నాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ సినిమాకు మైత్రి మూవీస్ నిర్మాణ సారథ్యం వహించనుంది అంట. అదేంటి అనిల్ సుంకర ఏషియన్ సునీల్ దగ్గరకు పంపారు.. ఆయన పంపిన హీరో దగ్గర ఆ కథ వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు అనిల్ సుంకర నిర్మాణంలోనే ఈ సినిమా రావాలి కదా అన్న సందేహం సహజంగానే వస్తుంది.
అయితే అనిల్ సుంకర బ్యానర్ కు కాకుండా మరే బ్యానర్‌కు అయినా సినిమా చేస్తానని శర్వానంద్ స్వయంగా చెప్పటం వల్లే దర్శకుడు రామ్ మైత్రి వాళ్ల దగ్గరకు వెళ్లాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శర్వానంద్ అలా ఎందుకు అంటాడు అన్న సందేహం కూడా వస్తుంది. మహాసముద్రం తర్వాత మరో సినిమా చేస్తానని అనిల్ సుంకరకు శర్వానంద్ మాట ఇచ్చాడట. ఇప్పుడు అదే బ్యానర్లో సినిమా చేస్తే రెమ్యూనరేషన్ లేకుండానో లేదా తక్కువ రెమ్యునరేషన్‌కో సినిమా చేయాల్సి వస్తుంది.
అందుకే ఆ బ్యానర్ కు కాకుండా వేరే బ్యానర్ లో ఈ సినిమా చేయడానికి శర్వానంద్ మొగ్గు చూపుతాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ ఒక్కో సినిమాకు తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అంత రెమ్యునరేషన్ వదులుకోవాలని లేదా అందులో సగం రెమ్యునరేషన్ కి సినిమా చేయాలంటే సహజంగానే ఏ హీరోకు అయినా కాస్త ఇబ్బందే.
అందుకే శర్వానంద్ మరో బ్యానర్‌లో సినిమా చేస్తానని దర్శకుడికి కండీషన్లు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో శర్వానంద్ ని మాత్రమే తప్పు పట్టడానికి వీలు లేదు.. టాలీవుడ్ లో అందరి హీరోలు ఇలాగే చేస్తున్నారు.. తమను నమ్మి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు నష్టపోతే ఇంకో సినిమా చేస్తాం డేట్ లో ఇస్తాం అని అబద్ధపు, కల్లిబొల్లి మాటలు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారు.