సీనియర్ దివంగత నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరో అయిన వడ్డే నవీన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పెళ్లి సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించాడు. వడ్డే నవీన్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. 31కు పైగా సినిమాల్లో నటించిన నవీన్ ప్రస్తుతం ఫేడ్అవుట్ అయిపోయాడు. మీడియా ముందుకు కూడా రావడం లేదు.
తన వ్యాపారాలలో బిజీ బిజీగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. నవీన్ ఎన్టీఆర్ మనవరాలు అయిన విజయ చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. అయితే చాముండేశ్వరుని పెళ్లి చేసుకునే ముందే నవీన్ ఒక హీరోయిన్ ను గాఢంగా ప్రేమించడంతో పాటు ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె ఎవరో కాదు దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కజిన్ సిస్టర్ మహేశ్వరి. వడ్డే నవీన్ – మహేశ్వరి కాంబినేషన్లో పెళ్లి సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేశ్వరితో కలిసి మా బాలాజీ సినిమాలో కూడా నటించారు.
ఈ రెండు సినిమాలలో నటించే సమయంలోనే మహేశ్వరి – వడ్డే నవీన్ ప్రేమలో పడిపోయి డేటింగ్ కూడా చేశారట. ఆ తర్వాత నవీన్ కు నాలుగైదు ఫ్లాప్ సినిమాలు రావడంతో ఆయన సినిమా కెరియర్ కాస్త డిస్టర్బ్ అయింది. ఆ వెంటనే తండ్రి వడ్డే రమేష్ నవీన్ కు బలమైన సినీ బ్యాగ్రౌండ్ ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశారు. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ తన మనవరాలైన చాముండేశ్వరుని నవీన్‌కు ఇచ్చి పెళ్లి చేయాలన్న ప్రతిపాదన చేశారు.
ఎన్టీఆర్ తో వడ్డే రమేష్ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఈ పరిచయంతోనే రెండు కుటుంబాలు బంధుత్వం కలుపుకున్నాయి. అటు ఎన్టీఆర్ సైతం తన మనవరాలిని మీ ఇంటికి కోడలిగా పంపుతున్నాను అని వడ్డే రమేష్ కు చెప్పడంతో రమేష్ కాదనలేదు. ఆ పెళ్లి నవీన్ కు ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక.. తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన హీరోయిన్ మహేశ్వరిని వదులుకున్నారు.
అయితే చాముండేశ్వరి – నవీన్ వైవాహిక బంధం ఎన్నో రోజులు నిలవలేదు. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు పెళ్లి అయిన కొద్ది రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నవీన్ విజయవాడకే చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నవీన్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.