Newsఇలియానా కొడుకును చూస్తారా.... సేమ్ టు సేమ్ త‌ల్లి పోలిక‌లే...!

ఇలియానా కొడుకును చూస్తారా…. సేమ్ టు సేమ్ త‌ల్లి పోలిక‌లే…!

సెలబ్రిటీలంతా తమకు పుట్టిన కొడుకు లేదా కూతురు ఫోటోలను వెంటనే బయట పెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు. కొద్ది రోజుల తర్వాత వారసుడు లేదా వారసురాలి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలియానా మాత్రం అలా చేయలేదు. బిడ్డ పుట్టిన నాలుగు రోజులకే వాడి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు పేరు కూడా బయట పెట్టేసింది. ఇప్పుడు మరోసారి తన కొడుకుతో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

కొడుకు పుట్టిన రెండు నెలల తర్వాత ఇలియానా మళ్లీ ఈ ఫోటోతో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ని కూడా ఆమె పరిచయం చేసింది. అతడి పేరు మైఖేల్ డోలన్‌. ముందుగా తన ప్రియుడికి సంబంధించి బ్లర్‌ చేసిన ఫోటో ఆ తర్వాత పూర్తి ఫోటో రిలీజ్ చేసింది. దానికి డేట్ నైట్ అని పేరు పెట్టింది. అంతకుమించి అతడి గురించి వివరాలు ఏం చెప్పలేదు.. అతడి ద్వారానే తనకు కొడుకు కోనిక్స్ డోలన్‌ పుట్టినట్టు తెలిపింది.

అయితే బాయ్ ఫ్రెండ్ తో ఇలియానాకు పెళ్లయిందా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అన్న పుకార్లు అయితే ఉన్నాయి. ఇలియానా మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది ఇలియానా. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవ్వాలన్న‌ కోరికతో అక్కడికి వెళ్లి అక్కడ జనాలు పట్టించుకోక ఫేడ్ అవుట్ అయింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఐ. ఆండ్రాతో సహజీవనం చేసింది. అతడితో మనస్పర్ధలు నేపథ్యంలో బ్రేకప్ చెప్పి ఇప్పుడు కొత్త ప్రియుడుతో ఏకంగా కొడుకుని కనేసింది. ఇక ఇలియానా బేబీ బంప్‌తో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్ చేస్తూ ఎంత రచ్చ చేసిందో చూశాం. ప్రస్తుతం కొడుకు అలనా పాలన చూసుకుంటున్న ఇలియానా కొద్ది నెలలు గడిచిన తర్వాత తిరిగి గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news