Newsపాపం... ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లిని ఎవ్వ‌రూ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ట్లేదా... మ‌నోడికి అదే...

పాపం… ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లిని ఎవ్వ‌రూ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ట్లేదా… మ‌నోడికి అదే మైన‌స్…!

టాలీవుడ్ లో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఉంది. ఏ దర్శకుడు ఖాళీగా లేడు. అందుబాటులో లేడు. అందరూ బిజీబిజీగా ఉన్నారు. రాజమౌళి – మహేష్ బాబు సినిమా కోసం పనిచేస్తున్నారు. త్రివిక్రమ్ గుంటూరు కారం తర్వాత బన్నీ సినిమా కోసం వర్క్ చేస్తారు. కొరటాలకు దేవర సినిమా ఉంది. సుకుమార్ కు పుష్ప తర్వాత కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అనిల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటు స్టార్ హీరోలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ అందరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం ఖాళీగా ఉన్నాడు.

సంక్రాంతికి తమిళ హీరో విజయ్ హీరోగా తెరకెక్కించిన వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయ్ క్రేజ్‌తో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి.. దిల్ రాజు ద్వారా టాలీవుడ్ స్టార్ హీరోలకు గేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నా.. మనోడిని మాత్రం ఎవ్వరు దగ్గరకు రానివ్వడం లేదు. వంశీ వెంట వెంటనే సినిమాలు చేసే రకం కాదు. తాయితీగా చాలా నిదానంగా రెండేళ్లకో సినిమా చేసుకుంటూ వెళ్తాడు.

సడన్గా ఏ హీరో అయినా ఖాళీ అవుతాడేమో ప్రాజెక్ట్‌ సెట్ చేద్దాం అని చూస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే తెలుగు కంటే.. తమిళ హీరోలే కాస్త అందుబాటులో ఉన్నారు. శివ కార్తికేయన్, ధనుష్ లాంటి హీరోలను పట్టుకుంటే వంశీకి ఒక సినిమా సెట్ అవ్వవచ్చు.. అయితే వంశీని తెలుగు హీరోలు దగ్గరకు రానివ్వకపోవటానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. వంశీ తెర‌కెక్కించిన సినిమాలు ఎక్కువగా మోస పద్ధతిలోనే ఉంటాయి. ఎంత కొత్త కథ ఇచ్చినా పాత చింతకాయ పచ్చడి టేకింగ్ తో తెరకెక్కించడం వంశీ పైడిపల్లికే దక్కుతుందన్న సెటైర్ మనవాడి మీద ఉంది.

వంశీ పైడిపల్లి ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్ని రొటీన్ ఫార్మాట్ లోనే ఉంటాయి. కథ‌లు ఏమాత్రం కొత్తగా ఉండవు. మున్నా ప్లాప్, బృందావనం ఎన్టీఆర్ క్రేజ్‌తో యావరేజ్‌గా నిలిచింది. ఎవడు, మహర్షి లాంటి సినిమాలు కూడా పరమ‌ రొటీన్ ఫార్మాట్‌లో వచ్చిన సినిమాలే కావడం విశేషం. వారసుడు పేరుకు మాత్రం హిట్ అయిందని చెప్పిన ఎంత పాత చింతకాయ పచ్చడి స్టోరినో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పైగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాలు చేస్తే అటు దర్శకుడికి పేరు రావటం లేదు.. ఇటు హీరోలకు పేరు రావటం లేదు.. కలెక్షన్లు కూడా అంత గొప్పగా ఉండటం లేదు.. అందుకే హీరోలు కూడా ఇప్పుడున్న పాన్ ఇండియా యుగంలో మనోడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. అందుకే వంశీ పైడిపల్లి రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమా చేసుకుంటూ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news