ఎస్ జె సూర్య తెలుగు నాట దర్శకుడిగా విఫలమై ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమాతో పాపులర్ అయిన సూర్య ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నాని సినిమా తెరకెక్కిస్తే డిజాస్టర్ అయింది. అటు తమిళంలో కూడా దర్శకుడుగా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే వైవిధ్యమైన నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల తవళంలో చక చకా సినిమాలు చేస్తున్నాడు. సూర్య నటించిన సినిమాలు తెలుగులో వస్తే మన వాళ్ళు కూడా ఆదరిస్తున్నారు.
మహేష్ బాబు స్పైడర్ సినిమాలో కూడా విలన్ గా నటించాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్. దీంతో మన తెలుగు సినిమాల్లోకి సూర్యను విలన్ గా తీసుకుంటే ఎలా ఉంటుందన్న ? ఆలోచనలు మొదలయ్యాయి. అయితే అతడు కోట్ చేస్తున్న రేటు చూసి మనవాళ్లు షాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. నాని – వివేక్ ఆత్రేయ – డి.వి.వి దానయ్య కాంబినేషన్లో సినిమాలో విలన్ పాత్రకు సూర్యను తీసుకోవాలని అనుకున్నారట. అయితే సూర్య వైపు నుంచి భారీ రెమ్యూనరేషన్ కోట్ చేయడంతో వెనక్కు తగ్గినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
విశ్వసినీయ వర్గాల సమాచారం ప్రకారం ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు పది కోట్లు కోట్ చేసినట్టు వినిపిస్తోంది. ఈ ఒక్క పాత్రకే రు. 10 కోట్లు ఇవ్వడం అంటే తెలుగులో ఒక మిడిల్ రేంజ్ హీరో రెమ్యూనరేషన్ అనుకోవాలి. సూర్యకు 10 కోట్లు ఇస్తే ఆ సినిమాకు రెమ్యూనరేషన్ దాదాపు రు. 40 కోట్లు దాటేస్తాయి.
హీరో నాని రెమ్యూనరేషన్ ఎలా చూసుకున్నా ? రు. 25 కోట్లు పై మాటే.. ఆ లెక్కన రెమ్యూనరేషన్లకు రు. 40 కోట్లు కూడా సరిపోయేలా లేదు. ఇక ప్రొడక్షన్ తో చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ రు. 70 కోట్లు దాటుతుంది. అందుకే ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సూర్య మరీ రు. 10 కోట్లు అడగడం అంటే కాస్త టూమచ్ గా అడుగుతున్నట్టే అనుకోవాలి.