2017లో ప్రారంభమైన మీ టూ ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రకంపనాలు సృష్టించింది. చాలామంది అగ్రనటులు, దర్శకనిర్మాతలపై చాలా చాలా లైంగీక ఆరోపణలు వచ్చాయి. మహిళా తారలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ మహిళా ఆర్టిస్టులు, ఫీమేల్ సింగర్స్‌తో పాటు చాలా మంది సినీ, ఇతర రంగాల్లో ఉన్న మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఈ వేదిక బహిర్గతం చేసింది. అయితే ఇటీవల ఈ మీటూ కాస్త చల్లపడినట్టే కనిపిస్తోంది.
మీ టూ బలంగా ఉన్న టైంలో సౌత్ నుంచి నార్త్ వరకు టాప్ హీరోయిన్లు, క్రేజీ హీరోయిన్లు సైతం తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపులపై బాగా ఓపెన్ అయ్యారు. అయితే కొంత కాలం నుంచి రివర్స్ మీటూ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు, మహిళా సెలబ్రిటీలు తమను ఎలా వేధించారో పురుషులు కూడా చెపుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ ప్రముఖ గాయకుడు తనని ఓ మహిళా అభిమాని వేధించారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వేదికపై ఉన్న తన వద్దకు ప్రేక్షకుల్లోంచి దూసుకొచ్చిన ఒక మహిళ తనపట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఇబ్బంది పెట్టిందని ప్రముఖ సింగర్ హార్డీ సంధు ఆరోపించాడు. యేడాదిన్నర క్రితం ఓ ప్రైవేటు వివాహ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగిందని సంధు తెలిపాడు.
నేను కచేరీ చేస్తున్నప్పుడు నా ముందు 40 – 45 ఏళ్ల ఓ మహిళ డ్యాన్స్ చేస్తోంది. ఆమె తాను స్టేజ్‌మీదకు రావాలనుకుంటున్నట్టు చెప్పింది. తాను వద్దని వారిస్తున్నా… ఆప్ ఆ జావో అన్నా కూడా ఆమె నాతో డ్యాన్స్ చేయమంటూ వేదిక మీదకు వచ్చేసిందని.. ఇద్దరం కలిసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశాము.. అప్పుడు ఆమెతో మీరు సంతోషంగా ఉన్నారా అంటే నిన్ను కౌగిలించుకోవచ్చా ? అని ప్రశ్నిస్తూనే వాటేసుకోవడంతో తాను షాక్ అయ్యానని సంధు వాపోయాడు.
ఆమె వాటేసుకుంటూనే నా చెవి కొరికిందని… ఇప్పుడు దాని గురించి మీరు కూడా ఆలోచన చేయాలి.. ఇలా రోల్స్ రివర్స్ అయితే తానేం చేయగలనంటూ సంధు వాపోయాడు. కలికాలం అంటే అంతేగా మరి అనుకోవాల్సిందే..!