యాంకర్ సుమ ఎంత గలగల చక చక స్పాంటేనియస్ గా మాట్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మకుటం లేని యాంకర్ గా ఇండస్ట్రిని ఏలేస్తున్న యాంకర్ సుమకు స్టేజ్ పైనే అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్ ఎదురయింది . రీసెంట్గా ఆదికేశవ సినిమాలోని లీలమ్మ పాట విడుదల వేడుకకు హోస్ట్ చేసింది. హైదరాబాదులో గురువారం సాయంత్రం ఈవెంట్ ఘనంగా జరిగింది . అయితే ఈ క్రమంలోనే సుమ కూసింత హద్దులు మీరుతూ ” బయట మీడియా వారు స్నాక్స్ ను భోజనంలా తింటున్నారు ” అని ఆమె చెబుతూ వ్యంగ్యంగా కౌంటర్ వేసింది.
అఫ్కోర్స్ సుమ కామెడీగా అన్నిందో లేకపోతే కావాలనే అన్నిందో తెలియదు కానీ ఆ మాటలకు ఓ విలేకరి చాలా బాధపడ్డాడు . దీంతో వెంటనే మైక్ తీసుకుని సుమను అడిగి కడిగి పడేసారు . మీ జోకులు మీ దగ్గరే పెట్టుకోండి మీడియా వారిపై అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ ఇచ్చి పడేసారు. దీంతో సుమ మళ్లీ వ్యంగ్యంగా స్నాక్స్ స్నాక్స్ లానే తిన్నారు ఓకేనా అంటూ కౌంటర్ వేసింది . దీంతో ఆయనకి మళ్ళీ కోపం వచ్చి ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది. మా దగ్గర ఇలా మాట్లాడొద్దు అంటూ గట్టిగానే చెప్పుకొచ్చాడు.
దీంతో సుమ అర్థం చేసుకొని ఓకే నా వల్ల మీరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు సుమ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది . మీడియా మిత్రులందరికి నమస్కారం ఓ ఈవెంట్లో నా వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతుంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నాను. మీరు ఎంత కష్టపడి పని చేస్తారో నాకు తెలుసు .. సరదాగా అన్న మాటలే దయచేసి సీరియస్గా తీసుకోకండి నన్ను ఓ కుటుంబ సభ్యురాలుగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.