మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈనెల 20న థియేటర్లలోకి రాబోతుంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. అంతకుముందు డిసెంబర్లో శ్రీలీలతో కలిసి రవితేజ నటించిన ధమాకా సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ నటించిన రావణాసుర సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు తో బయోపిక్ హీరోగా రియల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ తోనే ఈ సినిమాపై హైప్ వచ్చేసింది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతిసనన్ సోదరి నుపూర్ సనన్ – గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణు దేశాయ్ కథను మలుపు తిప్పే కీలకమైన హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 37.50 కోట్ల బిజినెస్ జరిగింది.
రవితేజ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ అని చెప్పాలి. నైజంలో 8.60 కోట్లు – ఆంధ్రాలో 17 కోట్లకి డీల్ క్లోజ్ అయింది. ఆంధ్ర ఏరియా అన్ని హక్కులను వెస్ట్ గోదావరికి చెందిన ఉషా పిక్చర్స్ హోల్‌సేల్ రేట్ కి కొనుగోలు చేసింది. సీడెడ్‌లో రు. 5.40 కోట్లకి సెట్ అయింది. ఓవర్సీస్ లో మూడు కోట్లు – కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు కోట్ల వరకు బిజినెస్ జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రు. 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రు. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాకు ఒక రోజు ముందుగా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అవుతోంది. విజయ్ లియో సినిమా సైతం ఒకరోజు ముందుగా రిలీజ్ కావలసి ఉన్నా కోర్టు జోక్యంతో వాయిదా పడింది. లియో ఈనెల 20న టైగర్ నాగేశ్వరరావుతో పాటు రిలీజ్ అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ పై గట్టిగా ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.