ఈ దసరా పండుగకు రిలీజ్ అయిన సినిమాలలో బాలయ్య భగవంత్ కేసరి – విజయ్ లియోతో పాటు మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా ఒకటి. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ కి జోడిగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించేశారు. అనుపమ్‌ఖేర్, నాజర్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో హేమలత లవణం పాత్రలో చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించారు. గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి తోడు భగవంత్ కేసరి సినిమాలు పోటీలో ఉండటంతో అనుకున్న స్థాయిలో థియేటర్లు కూడా దొరకలేదు.
మొదటి రోజు రవితేజ సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ కూడా లేకపోవడంతో ఊహించిన రేంజ్ లో కలెక్షన్లు అందుకోలేకపోయింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 7.05 కోట్ల రేంజ్ లో గ్రాస్, 4.33 కోట్ల రేంజ్లో షేర్ సాధించింది. వరల్డ్ వైడ్ గా చూస్తే 5.20 కోట్ల షేర్, 9.30 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రు. 38.50. ఇంకా ఈ సినిమా రు. 33.30 కోట్ల రేంజ్లో షేర్ సొంతం చేసుకుంటేనే సినిమా క్లీన్ హిట్ అవుతుంది.
ఏది ఏమైనా రవితేజ సోలోగా వచ్చుంటే ఖచ్చితంగా ఈ సినిమా రెస్పాన్స్ వేరేలా ఉండేది. రాంగ్ టైంలో మూడు సినిమాలు మధ్యలో పోటీలో దిగటం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఏరియాల వారీగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 1.50 కోట్లు
సీడెడ్ – 65 లక్షలు
ఉత్తరాంధ్ర – 48 లక్షలు
ఈస్ట్ – 42 లక్షలు
వెస్ట్ – 23 లక్షలు
గుంటూరు – 60 లక్షలు
కృష్ణ – 27 లక్షలు
నెల్లూరు – 18 లక్షలు
ఏపీ + తెలంగాణ = 4.33 కోట్లు షేర్
గ్రాస్ = 7.05 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ = 9.03 కోట్లు