Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా..పుష్ప కి అమ్మ మొగుడి...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా..పుష్ప కి అమ్మ మొగుడి లాంటి సినిమా ఇది..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన వరుస ఆఫర్లతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ఆఫర్లు పట్టేస్తున్న రష్మిక.. రీసెంట్ గానే అనిమల్ సినిమాకి సంబంధించిన టీజర్ లో ఏ విధంగా నటన కనబరిచి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిందో మనకు తెలిసిందే . ఇదే క్రమంలో మరో బాలీవుడ్ బడా ప్రాజెక్టులో భాగం కానుంది రష్మిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి వాఎ 2 సినిమా చేయనున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ భారీ మూవీ పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలోనే చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట మేకర్స్.

అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్గా ప్రియాంక చోప్రా కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో రష్మిక మందన్నా బడా ఆఫర్ పట్టేసింది అని.. ఇక పుష్ప లెవెల్ కి మించిన మరో హిట్ తన ఖాతాలో పడబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రష్మిక జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news