టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్మిక రష్మిక మందన్న డేటింగ్లో ఉన్నారంటూ గత రెండేళ్లుగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద, ఆఫ్ స్క్రీన్ మీద సూపర్బ్ అనేలా ఉండడం, బయట కూడా చాలా అంటే చాలా సన్నిహితంగా ఉండడం.. విజయ్ – రష్మిక ఒకరి ప్రస్తావన వస్తే ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించేసుకోవడం జరుగుతూ వస్తోంది.
ఇవన్నీ సహజంగానే వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉందా ? అన్న సంకేతాలు కూడా వదులుతున్నాయి. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్లో సినిమాలను తీసేందుకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బయట వెకేషన్లలో కూడా వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. దీంతో వీరి ప్రేమ అనుమానాలకు మరింత బలం కలుగుతోంది.
తాజాగా రష్మిక టర్కీలో వెకేషన్‌కు వెళ్లిన ఫొటో షేర్ చేసింది. డెస్టినేషన్ నన్ను కనిపెడుతున్నానని.. ట్రావెలింగ్ డేస్ మిస్ అవుతున్నానంటూ క్యాప్షన్‌లో రాసుకువచ్చింది. అయితే ఆ ఫోటోలు మే నెలలో దిగినట్టు నెటిజన్లు గుర్తించారు. అయితే అదే టైంలో విజయ్ సేమ్ అదే లొకేషన్లో దిగినట్టు గుర్తించారు. అప్పుడు ఖుషి మూవీ షూటింగ్ జరుగుతోందట.
దీంతో నెటిజన్లు వీరిద్దరు ప్రేమలో ఉన్నారని చెప్పేందుకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా ? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక తర్వాత కూడా చాలాసార్లు వీరిద్దరు కలిసి రెస్టారెంట్లలోనూ, పబ్లిక్ ప్లేస్‌ల్లోనూ కనిపిస్తూనే ఉన్నారు.