Moviesమరో కాంట్రవర్షీయల్ రోల్ లో రష్మిక మందన్నా.. ఈసారి ఒక్కోక్కడికి పగిలిపోవాల్సిందే(వీడియో)..!!

మరో కాంట్రవర్షీయల్ రోల్ లో రష్మిక మందన్నా.. ఈసారి ఒక్కోక్కడికి పగిలిపోవాల్సిందే(వీడియో)..!!

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతుంది. మరీ ముఖ్యంగా అనిమల్ సినిమాలోని ఫస్ట్ పాట రిలీజ్ అయిన తర్వాత రష్మిక మందన్నా ను ఏ రేంజ్ లో ఏకేస్తున్నారో జనాలు మనం చూసాం .. రన్బీర్ కపూర్ తో ఘాటైన లిప్ లాక్ లను చేసిన తర్వాతే రష్మిక మందన్నా ఇలా ట్రోల్ చేస్తున్నారు జనాలు .

అయితే మరోసారి ఇంకో కాంట్రవర్షియల్ పాత్రలో మన ముందుకు రాబోతుంది రష్మిక మందన్నా. రష్మిక తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసింది . యాక్టర్ కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ నిర్మాణంలో రష్మిక మందన్నా లీడ్ గా..” ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమాలో నటించబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది .

దీనికి సంబంధించిన ఒక చిన్న గ్మిల్ప్స్ ని కూడా రిలీజ్ చేశారు . నీళ్లల్లో మునిగిపోతున్నటువంటి రష్మిక మందన్నాను మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఖుషి సినిమాకి ఆల్బమ్ చేసిన హేశం అబ్దుల్ ఈ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నారు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక నటన టూ పీక్స్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు రష్మికను గ్లామర్స్ పాత్రలకే పరిమితమైంది అని చెప్పే వాళ్లకు పగిలిపోయే ఆన్సర్ ఈ సినిమా ద్వారా ఇవ్వబోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news