త్వరలోనే భార్యాభర్తలు కాబోతున్న వరుణ్ లావణ్య త్రిపాఠిల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి . ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంలో తన ఇంట్లో లావణ్య త్రిపాఠి వరుణ్ ల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించగా.. ఇప్పుడు అల్లు అరవింద్ ఇంట్లో మరోసారి వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా చాలా ఘనంగా జరిగాయి.
అల్లువారి ఇంట్లో జరిగిన వరుణ్ తేజ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీ కు చిరంజీవి – నాగబాబు – అల్లు అర్జున్ – సాయి ధరమ్ తేజ్ -అల్లు శిరీష్ – అల్లు అరవింద్ -ఉపాసన -వైష్ణవ తేజ్ తో పాటు హీరో నితిన్ హీరోయిన్ రీతు వర్మ కూడా అటెండ్ అయ్యారు. దీంతో దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈవెంట్ కి రామ్ చరణ్ రాకపోవడం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది .
గతంలో మెగా ఫ్యామిలీ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ కి అల్లు అర్జున్ – స్నేహా రాలేదు . ఇప్పుడు అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి రాంచరణ్ రాలేదు . దీంతో వీరి మధ్య ఏదో ఫైట్ నడుస్తుంది అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే చరణ్ షూట్ లో బిజీ గా ఉన్నాడని అందుకే రాలేకపోతున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!