దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఇప్పుడు ఎల్లలు దాటేసింది. రాజమౌళి అంటే ఇప్పుడు కేవలం తెలుగు డైరెక్టర్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా డైరెక్టర్ కూడా.. కాదు పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, 2 – ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఏ దేశంలో.. నలుమూలలా ఎక్కడ ఉన్నా కూడా రాజమౌళి గురించి గొప్పగా చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లను కూడా మించిన క్రేజ్ రాజమౌళికి వచ్చేసింది.
ఇక ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే రాజమౌళి పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయికి వెళ్లిందో తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కేఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం టాలీవుడ్ సినీ జనాలు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన రాజమౌళి ఆ వెంటనే మహేష్ బాబుతో సినిమా అనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు 20 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలు ఎక్కుతోంది. ఈ సినిమా కోసం రాజమౌళి భారీగా పారితోషకం అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం రాజమౌళి రెమ్యూనరేషన్ గా రు. 120 కోట్లు అందుకోబోతున్నాడట.
ఆ తర్వాత సినిమాకు జరిగే బిజినెస్.. వచ్చే లాభాల్లో కూడా రాజమౌళికి వాటా ఉండబోతుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇది నిజంగా చాలా భారీ మొత్తం అని చెప్పాలి. ఇక మహేష్ బాబు రెమ్యునరేషన్ ఏ రేంజ్‌లో ? ఉంటుందో కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న గుంటూరు కారం సినిమా కోసం మహేష్‌కు రు. 78 కోట్ల రెమ్యూనరేషన్ ముడుతుంది. ఇక రాజమౌళి సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర పాటు కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా కోసం మహేష్ ఎంత డిమాండ్ చేస్తాడో చూడాలి మరి..!