టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి.. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ దాదాపు ఓకే టైంలో కెరీర్ ప్రారంభించారు. 2001లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో త్రివిక్రమ్.. అదే ఏడాది ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1తో రాజమౌళి – మరుసటి ఏడాది 2002 మార్చిలో వచ్చిన ఎన్టీఆర్ ఆది సినిమాతో వివి. వినాయక్ దర్శకులుగా మారారు. ఈ రెండు దశాబ్దాలలో ఈ ముగ్గురు స్టార్ దర్శకులుగా ఎదిగారు.
అయితే రాజమౌళి తెలుగు సినిమాకి ఏకంగా ఆస్కార్ స్థాయికి తీసుకువెళ్లారు. త్రివిక్రమ్ కూడా రాజమౌళి తర్వాత దూసుకుపోతున్నారు. అయితే వినాయక్ మాత్రం వరుస ప్లాపులతో ఫేడ్ అవుట్ దశకు దగ్గరలో ఉన్నారు. అప్పట్లో ఈ ముగ్గురు దర్శకుల విషయంలో ఒకటాక్ ఉండేది. రాజమౌళి, వినాయక్ పనిచేసిన హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేసేవారు కాదు. రాజమౌళి, వినాయక్ ఎన్టీఆర్ – ప్రభాస్ – రవితేజ – రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేశారు.. సూపర్ హిట్లు ఇచ్చారు.
అదే టైంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ – మహేష్ బాబుతో సినిమాలో చేసి హిట్లు కొట్టారు. త్రివిక్రమ్ పై ముగ్గురు హీరోలను రిపీట్ చేస్తూ సినిమాలు చేశారు. త్రివిక్రమ్ పనిచేసిన బన్నీ, మహేష్, పవన్ కళ్యాణ్ తో రాజమౌళి కానీ వినాయక్ కానీ సినిమాలు తీయలేదు. అరవింద సమేత సినిమా వరకు త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌కు కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. అప్పట్లో కావాలని త్రివిక్రమ్ ఇలా చేస్తున్నాడని ఒక ప్రచారం కూడా జరిగింది.
ఇది కాకతాళియంగా జరిగినా రాజమౌళి, వినాయక్ పనిచేసిన హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు తీయలేదు. అలాగే త్రివిక్రమ్ సినిమాలు తీసి హిట్లు కొట్టిన హీరోలతో రాజమౌళి, వినాయక్ ఇద్దరు సినిమాలు చేయలేదు. ఇక ఎన్టీఆర్ రాజమౌళి – వినాయక్‌తో మూడేసి సినిమాలలో నటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళితో ఎన్టీఆర్‌కు నాలుగో సినిమా అయితే.. చివరగా త్రివిక్రమ్ తో అరవింద సమేత సినిమాలో మాత్రం ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే.