టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో రాఘవేంద్రరావు కూడా ఒకరు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరోలతో సినిమా చేసి సూపర్ హిట్లు అందుకున్నారు. అంతే కాకుండా మామూలు హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ఘనత కూడా రాఘవేంద్రరావుకు ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా రాఘవేంద్రరావు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ఒక్కప్పుడు ఆయన సినిమాల్లో గ్లామర్ సీన్లు ఎక్కువగా ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలకు రాఘవేంద్రరావు తనదైన స్టైల్ సమాధానం చెప్పారు. భక్తిరస సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించారు.
అన్నమయ్య, పాండురంగడు, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలతో రాఘవేంద్రరావు తన మార్క్ ను వేసుకున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పెళ్లిసందడి సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసారు.
అయితే ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఇక చివరగా రాఘవేంద్రరావు నాగార్జున హీరోగా శ్రీనమోః వెంకటేశాయ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఆ తరవాత మళ్లీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా రాలేదు.
అయితే అప్పట్లో రాఘవేంద్రరావుకు ఉన్న క్రేజ్ వల్ల ఆయనతో సినిమా చేసేందుకు హీరోయిన్లు హీరోలు క్యూ కట్టేవారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం కథ నచ్చినా ఆయన పేరు వినగానే సినిమా చేయనని చెప్పింది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన త్రిశూలం సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్రరావు ముందుగా బాలీవుడ్ హీరోయిన్ స్మిత పాటిల్ ను అనుకున్నారు. కథ విని సినిమా చేస్తానని చెప్పిన స్మిత ఆ తరవాత ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని చెప్పగానే నో చెప్పేసింది. అంతే కాకుండా ఆయన ఏదో చిన్న పాయింట్ పట్టుకుని లాజిక్ లేకుండా సినిమాలు చేస్తారని అందువల్లే ఆయనతో సినిమా చేయనని చెప్పినట్టు పేర్కొంది.