టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరి కంటే పూరి జగన్నాద్ దగ్గర హీరోయిన్, మోడల్స్ కి సంబంధించిన ఆల్బంస్ కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఏ కథకి ఎవరు అవసరం ఉంటారో అందులోనుంచే సెలెక్ట్ చేసుకుంటారు. సినిమా తీయడంలో పూరి స్పీడ్ ఇంకెవరికీ ఉండదు. ఫ్లాప్ వచ్చినా, హిట్ వచ్చినా ఒకేలా ఉండే పూరి జగన్నాద్ హీరోలకి మాత్రం జీవితానికి సరిపడా మాస్ ఇమేజ్ తెచ్చిపెడతారు.
అయితే, హీరోయిన్స్ మాత్రం ఎందుకనో ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగలేరు. అనుష్క లాంటి ఇద్దరు ముగ్గురు తప్ప పూరి పరిచయం చేసిన హీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేసింది లేదనే చెప్పాలి. కొందరైతే ఒకే ఒక్క సినిమాతో తట్టా బుట్టా సర్దేసుకొని కొంపకి చేరుకున్నారు. దీనికి కారణం ఆ సినిమా ఫ్లాపవడం ఒకటైతే, హీరోయిన్ ని పూరి చూపించినట్టుగా ఇంకో దర్శకుడు చూపించలేకపోవడమే.
ఇండస్ట్రీ దూరం పెట్టిన మాధవీ లత లాంటి వారు వెళ్ళి మీరు ఎందుకు ? తెలుగమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వరు..? అంటే ఆయన చెప్పిన సమాధానం చాలా కన్విన్సింగ్‌గా అనిపించిందని స్వయంగా మాధవీ లత ఒప్పుకున్న సందర్భం ఉంది. తెలుగమ్మాయిలను సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటే 100 తలనొప్పులుంటాయి. ఇది చేయము అది చేయము ఇలా కాస్ట్యూంస్ వేసుకోము..అలా పర్ఫార్మ్ చేయమూ అని కండీషన్స్ పెడుతుంటారు.
నేను తీసే సినిమా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటుంది. నేను హీరోయిన్ కోసమే కాదు హీరో కోసమూ ఎక్కువగా వెయిట్ చేయను. నా కథకి తగ్గట్టు నటించడానికి ఒప్పుకునే అమ్మాయి కావాలి. దానికోసమే ముంబై నుంచి మోడల్స్ ని గానీ, ఇంకో భాష నుంచి హీరోయిన్ ని గానీ సెలక్ట్ చేసుకుంటాను అని చెప్పారు. తెలుగమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వాలని నాకు ఉంటుంది. కానీ, వారు పెట్టే కండీషన్స్ నా వల్ల కాదు అని కుండ బద్దలు కొట్టారు ఓ సందర్భంలో..!