Newsభ‌క్త‌క‌న్న‌ప్ప‌లో శివుడిగా ప్ర‌భాస్‌... అచ్చు ప‌ర‌మేశ్వ‌రుడిలానే... ( ఫొటోలు)

భ‌క్త‌క‌న్న‌ప్ప‌లో శివుడిగా ప్ర‌భాస్‌… అచ్చు ప‌ర‌మేశ్వ‌రుడిలానే… ( ఫొటోలు)

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సలార్. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తనకెక్కుతున్న ప్రాజెక్టు కల్కి సినిమాతోనూ వచ్చేయేడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే ప్రభాస్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇదంతా ఇలా ఉంటే టాలీవుడ్ నటుడు మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు భక్తకన్నప్పలో శివుడు పాత్రలో ప్రభాస్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .ఇది నిజమే అని త్వరలో దీనిపై అధికారికి ప్రకటన రానుందని తెలుస్తోంది.

భక్తకన్నప్ప కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది రు. 150 కోట్లతో భారీ బడ్జెట్ తో మంచి విష్ణు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం న్యూజిలాండ్లో జరుగుతోంది. షూటింగ్ కోసం ఇప్పటికే 7 కంటైనర్ల సెట్ మెటీరియల్ న్యూజిలాండ్ కు రవాణా చేశారట.ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నారు.

గతంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు భక్తకన్నప్ప సినిమాలో నటించి ఎలా మెప్పించారో ?తెలిసిందే. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో మెప్పించారు. ఇప్పుడు కన్నప్పలో శివుడి రూపంలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చేసాయి.. టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ప్రభాస్ పోస్టర్లు డిజైన్ చేసి షేర్ చేస్తున్నారు అభిమానులు. శివుడి వేషంలో ప్రభాస్ లుక్ చూసిన వారంతా ప్రభాస్ సూపర్ గా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలో శివగా ప్రభాస్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుందని కూడా తెలుస్తోంది. కన్నప్పలో శివ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. పార్వతిగా నయనతార కనిపించనుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో పౌరాణిక పాత్రల్లో ఆమె నటించిందన్న కారణంతో నయనతారని ఈ పాత్రకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ శివుడిగా అచ్చి గుద్దినట్టు అలా ఒదిగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news