Newsనా ల‌వ‌ర్ వ‌ల్ల నా కాపురంలో చిచ్చు.. భార్య ముందే నిజం...

నా ల‌వ‌ర్ వ‌ల్ల నా కాపురంలో చిచ్చు.. భార్య ముందే నిజం ఒప్పుకున్న ప్ర‌భాక‌ర్‌..!

సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానల్స్ లో, క్రేజీ సీరియ‌ల్స్ లో నటిస్తూ బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక బుల్లితెరపై ప‌లు షోలు కూడా చేస్తూ ఉంటాడు. తాజాగా ఆ షోకు తన భార్యతో సహా వచ్చిన ప్రభాకర్ తన జీవితం, ప్రేమ.. పెళ్లి గురించి మాట్లాడాడు. ఈ షోలో ప్రభాకర్ – మలయ‌జ‌ పెళ్లి ఫోటోలను స్క్రీన్ మీద‌ ప్లే చేయగానే తమ ప్రేమ‌, పెళ్లి గురించి ఓపెన్ అయిపోయాడు.

త‌మ‌ది దొంగ పెళ్లి అని… ఆర్య సమాజంలో ఏడడుగులు వేసామని తెలిపారు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన తన స్నేహితుడు పెళ్లిలో కన్యాదానం చేశాడని.. నాటి సంగతుల్ని ప్రభాకర్ గుర్తు చేసుకున్నాడు. నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది.. ఆ విషయంలో నా భార్య చాలా బాధపడింది.. ఆ గర్ల్ ఫ్రెండ్ వల్ల నా జీవితంలో చిచ్చు రేగింది.. అయితే దానిని ఎలాగోలా సరిచేసుకొని మనస్పూర్తిగా నా భార్యను క్షమించమని వేడుకున్నానని ప్రభాకర్ తెలిపాడు.

అయితే నేను సారీ చెప్పటం గొప్పకాదు.. తను నన్ను క్షమించడం గొప్ప విషయం అని భార్య మలయజ గురించి చెప్పాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే ఆమె బుగ్గపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్ గా మారింది. ఇక ప్రభాకర్ పలు సీరియ‌ల్స్‌ చేస్తూ బిజీగా ఉండగా.. అతడి భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కాకపోయినా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉంటుంది.

ఆమెకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇక‌ ప్రభాకర్ కొడుకు సుహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా ఎప్పటికే చాలామందికి పరిచయం. మ‌నోడు త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కూతురు దివిజా కూడా కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news