పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో బద్రి – జానీ సినిమాలలో నటించిన రేణు పవన్‌తో ప్రేమలో పడింది. చాలా ఏళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట అఖీరా నందన్, ఆద్యలకు జన్మనిచ్చారు. 11 ఏళ్లపాటు కలిసి కాపురం చేశాక మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత రేణు పూణేలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నా చాలా ఏళ్ల తర్వాత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
ఈ సినిమాలో ఆమె హేమలత లవణం పాత్రలో నటించారు. మధ్యలో ఆమె తెలుగు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్లలో రేణు చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కొడుకును బిగ్ స్క్రీన్‌పై చూడాలని ప్రతి తల్లికి కోరిక ఉంటుంది.. అలాగే నాకు కూడా ఉంది.. అయితే హీరో కావాలన్న కోరిక ముందు తనకి అనిపించాలని తెలిపింది.
అఖీరా చూడటానికి అందంగా ఉంటాడు.. ఒక నటుడికి కావలసిన అన్ని క్వాలిటీలు తనలో ఉన్నాయి.. నేను ఒక నటిని వాళ్ళ నాన్న, పెదనాన్న నటులు.. తను తెరపై ఎలా కనిపిస్తాడో ? చూడాలని తల్లిగా నాకు ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పింది. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయంలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ లో మా అమ్మాయి నుంచి వచ్చిందని కూడా తెలిపింది.
నీ వయసుకు తగ్గ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉందమ్మా అని తన కుమార్తె చెప్పిందని.. ఇది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని రేణు దేశాయ్ తెలిపింది. ఇక టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా అక్టోబర్ 24 థియేటర్లలోకి దిగుతోంది.