అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి తెలిసిందే. చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అన్నా పవన్ ఊరుకోరు. ఇక పవన్ గురించి ఎవరైనా విమర్శలు చేసినా కూడా చిరంజీవి ఒప్పుకోరు. అలా ఇద్దరి మధ్య అన్నదమ్ముల బంధం ఉంటుంది. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సినిమాల్లో నటిస్తే అది అభిమానులకు ఇక పండుగేనని చెప్పవచ్చు.
కొన్ని సినిమాల్లో ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించగా.. ఏకంగా పవన్ కల్యాణ్ హీరోగా చిరంజీవి ఒక సినిమాకు ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. చిరంజీవి దర్శకత్వంలో పవన్ హీరోగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను కూడా అందించారు.
ఈ కాంబోలో సినిమాను తీసుకొచ్చేందుకు ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా పూర్తయ్యాయి. సినిమా షూటింగ్ మొదలవుతుందని అనుకునేలోగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. సోనాలి బింద్రేను ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలని కూడా ఫిక్స్ చేశారు. పరుచూరి బ్రదర్స్ రాసిన కథ చిరంజీవి, పవన్ కు నచ్చింది. దీంతో గుడుంబా శంకర్ తర్వాత ఈ సినిమా చేద్దామని పవన్ అనుకున్నారు. కానీ కథ ఫస్టాఫ్ చిరంజీవికి బాగా నచ్చగా.. సెకండాఫ్ మాత్రం నచ్చలేదు.
దీంతో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని పరుచూరి బ్రదర్స్ కు చిరంజీవి సూచించాడు. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేసినా చిరంజీవి సంతృప్తి చెందలేదు. దీంతో కొన్ని రోజులు ఆగి ఆ తర్వాత చేద్దామని చిరు చెప్పారు. ఆ తర్వాత ముందుకు అడుగులు పడకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ కథతో బాలు సినిమా వచ్చింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది.