Newsప‌వ‌న్ ' OG ' భేరాలు తెగ‌ట్లేదా... ప‌వ‌న్ మార్కెట్ ఎందుకు...

ప‌వ‌న్ ‘ OG ‘ భేరాలు తెగ‌ట్లేదా… ప‌వ‌న్ మార్కెట్ ఎందుకు ? త‌గ్గింది… ఏం జ‌రుగుతోంది ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసిన నటించిన‌ ఈ మల్టీస్టారర్ సినిమా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ – క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు – సుజిత్ దర్శకత్వంలో ఓజీ చేస్తున్నాడు. ఓజీ సినిమా షూటింగ్ నడుస్తోంది.. ఓజీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. మరో నెల రోజులు పవన్ డేట్లు కేటాయిస్తే ఓజి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.

పవన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు పెద్ద సమస్య వస్తోంది. అసలు సెట్స్ మీద ఉన్న సినిమాలు ఎప్పటికీ పూర్తి అవుతాయో గందరగోళం తప్పట్లేదు. ఓజీ సినిమాను ముందుగా డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. క్రిస్మస్ కానుకగా ఓజీ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకు పవన్ డేట్లు ఇవ్వకపోవడంతో దర్శక, నిర్మాతలు ఇద్దరు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. విచిత్రం ఏంటంటే ఓజీ సినిమాకు పవన్ రేంజ్ కు తగినట్టుగా ఏపీ, నైజాంలో భేరాలు కూడా తెగట్లేదు అని తెలుస్తుంది.

పవన్ గత మూడు సినిమాలు వకీల్ సాబ్ – భీమ్లా నాయక్ – బ్రో సినిమాలకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కు వచ్చిన వసూళ్లకు పొంతనలేదు. పవన్ మార్కెట్ బాగా పడిపోయిందన్న‌ది వాస్తవం. ఇప్పుడు ఓజీకి భారీ స్థాయిలో రేట్లు చెబుతున్న అంతంత రేట్లు పెట్టి కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదట. గ‌తంలో విజ‌యాలు, కేవ‌లం ప‌వ‌న్ క‌టౌట్ చూసి బొమ్మ అమ్మేసి నిర్మాత‌లు చేతులు దులిపేసుకుంటున్నారు.

అయితే ఇక్క‌డ సినిమాల‌కు టాక్ బాగున్నా ఆ రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డం లేదు. దీనికి తోడు ప‌వ‌న్ వ‌రుస‌గా రీమేక్‌లే చేసుకుంటూ పోతున్నాడు. అవి కూడా ప్రేక్ష‌కుల్లో ప‌వ‌న్ సినిమాల ప‌ట్ల గ‌తంలో ఉన్నంత ఆస‌క్తి లేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ ఇప్ప‌ట‌కి అయినా స్ట్రైట్ సినిమాల‌తో పాటు కాస్త పేరున్న ద‌ర్శ‌కుల కాంబినేష‌న్లో సినిమాలు చేస్తేనే ప‌వ‌న్ సినిమా ఇది అని అభిమానులు కాల‌ర్ ఎగ‌రేసే సినిమాలు వ‌స్తాయి. లేక‌పోతే చెట్టు పేరు చెప్పుకుని కాయ‌ల‌మ్ముకున్న చందంగా ప‌వ‌న్ సినిమాల మార్కెట్ ప‌డిపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news