Newsప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు న‌చ్చి న‌న్ను అలా చేశారు.. రేణుదేశాయ్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు న‌చ్చి న‌న్ను అలా చేశారు.. రేణుదేశాయ్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రేణు దేశాయ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని స్టార్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని అనుకున్నారు అభిమానులు. కానీ అంతకుమించి పవన్ కళ్యాణ్ భార్య‌గా తెలుగు సినీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. బద్రి టైం లోనే పవన్ – రేణు ప్రేమలో పడ్డారు. వారిద్దరూ సహజీవనం చేసి ఒక బిడ్డకు జన్మనిచ్చాక పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్ – పవన్ దంపతులకు మరో బిడ్డ జన్మించింది.

అదే టైంలో రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా మారి పవన్ సినిమాలు కోసం పనిచేసింది. 11 సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. పవన్ కి విడాకులు ఇచ్చేశాక రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో మహారాష్ట్రలోని పూణేలో ఒంటరిగానే నివసిస్తోంది. రేణుకు విడాకులు ఇచ్చినా తండ్రిగా పవన్ తన బాధ్యతలను ఏరోజు మర్చిపోలేదు. అకారా, ఆద్య‌లకు తండ్రిగా వారి చదువులతో పాటు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు.

చాలా ఏళ్ల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆమె తెలుగు తెరపై మెర‌వ‌నుంది. ఇదిలా ఉంటే రేణు ప‌వ‌న్ సినిమాల‌కు క్యాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా, డ్రెస్ స్పెష‌లిస్టుగా ప‌నిచేసింది. పెళ్ల‌య్యాక షాపింగ్‌కు వెళితే రేణులో ఉన్న డ్రెస్ సెన్స్ ప‌వ‌న్‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఈ క్ర‌మంలోనే రేణును ప‌వ‌న్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ను చేసేశార‌ట‌.

ఆ త‌ర్వాత రేణు జానీ సినిమాతో మొద‌లు పెట్టి ప‌వ‌న్ న‌టించిన చాలా సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది. రేణు డ్రెస్ సెన్స్ చాలా సినిమాల్లో ప‌వ‌న్‌ను ఎంతో అందంగా చూపించింది. ఇక ప్ర‌స్తుతం ఆమె న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా ఈ నెల 20 రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news