Newsమరోసారి కూతురి పాత్రలో శ్రీలీల..ఆ స్టార్ హీరో సినిమాలోనే..ఇంకో హిట్ పక్క..రాసిపెట్టుకోండి..!

మరోసారి కూతురి పాత్రలో శ్రీలీల..ఆ స్టార్ హీరో సినిమాలోనే..ఇంకో హిట్ పక్క..రాసిపెట్టుకోండి..!

అందరూ హీరోయిన్స్ గ్లామరస్ పాత్రలో నటించడానికి ..ఎక్స్ పోజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే .. మన హీరోయిన్ శ్రీలీల మాత్రం కూతురు పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ ట్రెండ్ ని మార్చేస్తుంది . నిజానికి కుర్రాళ్ళు శ్రీ లీలను హాట్ అండ్ సెక్సీ రోల్స్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు జనాలు. కానీ ఈ అందాల ముద్దుగుమ్మ అలాంటి రోల్స్ తో పాటు ట్రెడిషనల్ గా ఉండే పాత్రలను సైతం చూస్ చేసుకొని ఇంట్లోని పెద్దవాళ్లని సైతం అట్రాక్ట్ చేస్తుంది.

రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల – బాలయ్య కూతురుగా నటించి ఎలా మెప్పించిందో మనం చూసాం . భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య ఎంత కారణమో ..కూతురు పాత్రలో నటించిన శ్రీ లీల నటన కూడా అంతే కారణమని చెప్పుకోక తప్పదు . కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీ లీల మరో హీరోకి కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఈసారి కన్నడ ఇండస్ట్రీలో అలాంటి రోల్ చేయబోతుందట . తన మాతృ గడ్డపై శ్రీ లీల ఓ సినిమాను యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర సగం లోనే చనిపోతుంది . విలన్ కి సంబంధించిన వాళ్లు శ్రీ లీలను దారుణంగా రేప్ చేసి చంపేస్తారు . అయితే న్యాయంగా పోరాడి తన తండ్రి ఎలా గెలిచాడు అన్నదే ఈ సినిమా కధ. అలాంటి రోల్ లో శ్రీలీలను చూడడానికి జనాలు ఆసక్తిగా లేరు. కానీ శ్రీ లీల తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news