Newsఎన్టీఆర్ ' దేవ‌ర ' 2 పార్టులు.. తెర‌వెన‌క ఇంత పెద్ద...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ 2 పార్టులు.. తెర‌వెన‌క ఇంత పెద్ద క‌థ న‌డిచిందా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దర్శ‌కుడు కొరటాల దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతుందని అధికారికంగా ప్రకటించాడు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్‌ చేయబోయే సినిమాలపై రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

ఎన్టీఆర్ – ప్రశాంత్ కాంబోలో సినిమా చాలా ఆలస్యం కావచ్చు అంటూ కథనాలు కూడా వచ్చేసాయి. దీంతో ప్రశాంత్‌తో పాటు మైత్రీ మూవీస్‌ కూడా అలెర్ట్‌ అయిపోయారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళుతుందని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించింది. దేవర 1 అదే టైంలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

అంటే దేవర 1 రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వస్తుందని క్లారిటీ ఇచ్చేసింది మైత్రి మూవీస్. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్‌ సినిమా పూర్తి అయిన తర్వాత దేవర 2 మొదలవుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ ఒకడు మాత్రమే కాదు.. టోటల్ దేవ‌ర టీం ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీ అవుతారు.

విల‌న్‌గా చేస్తోన్న సైఫ్ ఆలీఖాన్ – జాన్వీక‌పూర్ కూడా ఇతర ప్రాజెక్టుల మీదకు వెళతారు. ఒక కొరటాల మాత్రమే దేవర 2 పనిమీద బిజీగా ఉంటాడు. ఓవరాల్ గా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఆలస్యం అవుతుందన్న పుకార్ల‌కు చెక్ పెట్టేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news