News"నితిన్ కి ఆ పిచ్చి ఎక్కువ.. రెండు నిమిషాల గ్యాప్ కూడా...

“నితిన్ కి ఆ పిచ్చి ఎక్కువ.. రెండు నిమిషాల గ్యాప్ కూడా వదలడా..? పాపం షాలిని..!!

నితిన్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలోకి జయం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తనలోని నటనను ఒక్క సినిమాతోనే బయటపెట్టిన టాలెంటెడ్ హీరో. జయం తరువాత నితిన్ కెరియర్ ఎలా జెట్ స్పీడ్ లో దూసుకుపోయిందో మనం చూశాం. అయితే ఒకానొక టైం లో ఆయన బాడీకి సూట్ అవ్వని కధలని చూస్ చేసుకొని బొక్క బోర్ల పడ్డారు .

ప్రెసెంట్ నితిన్ పలు సినిమాలలో బిజీగా ఉన్నారు . మరీ ముఖ్యంగా ఆయన నటిస్తున్న ఎక్స్ట్రార్డినరీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటుంది అంటూ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నితిన్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా నితిన్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత ఏజ్ వచ్చినా ఇప్పటికీ వీడియో గేమ్స్ పిచ్చి ఉందట .

తనకి ఏమాత్రం టైం దొరికినా ఫస్ట్ మొబైల్ ఆన్ చేసి గేమ్స్ ఆడేస్తారట . అంతేకాదు షూటింగ్లో ఒక 10 మినిట్స్ గ్యాప్ దొరికిన సరే వెంటనే కార్ వ్యాన్ లోకి వెళ్లి ఆయన గేమ్స్ ఆడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడట . అందరిలాగా బయట ఫ్రెండ్స్ తో తిరగడం పబ్బుల్లో ఎంజాయ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదట. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అందుకే తన భార్య షాలినితో కూడా దిగిన పిక్స్ చాలా రేర్ గా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు . మొత్తానికి నితిన్ కి ఏజ్ పెరిగిన ఇంకా చిన్నపిల్లాడి అల్లర్లు మాత్రం పోలేదు అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news