వామ్మో ఇది నిజంగా మెగా అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి. మెగా డాటర్ నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య వేరే పెళ్లి చేసుకోబోతున్నారా ..? అంటే అవునని సమాధానం వినిపిస్తుంది . మనకు తెలిసిందే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికను పెళ్లి చేసుకున్న జొన్నలగడ్డ చైతన్య ఆమెతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గానే కూకట్ పల్లిలో ని ఫ్యామిలీ కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బేసిస్ పై .. వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు .
ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య తన లైఫ్ తనది అంటూ నిహారిక తన లైఫ్ తనది అంటూ బ్రతికేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే నిహారిక నెక్స్ట్ మూవీస్ కోసం అమెరికా వెళ్ళింది . జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం జొన్నలగడ్డ చైతన్య రిలేటివ్స్ కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. అమ్మాయి వాళ్ల నాన కూడా పెద్ద పోలీస్ ఆఫిసర్.. సెలబ్రిటీకి మించిన గౌరం ఉందట.
ఇది నిజంగా నిహారికకు బిగ్ షాక్ అనే చెప్పాలి . నిహారిక లేనిదే చైతన్య బతకలేడు అనుకున్న వాళ్ళకి చైతన్య ఘాటైన ఆన్సర్ ఇవ్వబోతున్నాడు తన పెళ్లి ద్వారా అంటూ చైతన్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ విషయం నీహారికకు కూడా తెలుసని..ఆమె కూడా ఆయన రెండో పెళ్లి పట్ల హ్యాపీగానే ఉందట..!!