పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. 2000లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్.. అప్పుడు రేణు దేశాయ్ 17 – 18 సంవత్సరాలు మాత్రమే. తొలి సినిమాలో నటిస్తున్న సమయంలోనే తన తొలి సినిమా హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి చాలా ఏళ్లపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత 2003లో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలోను రేణు హీరోయిన్. ఆ తర్వాత ఆమె తన స్వస్థలం పూణే నుంచి హైదరాబాద్ వచ్చి పవన్ తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.
2010లో పవన్- రేణు దేశాయ్ ను అధికారికంగా వివాహం చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత రెండు మూడేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. పవన్ తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయి అన్నా లెజ్‌నోవాను మూడో పెళ్లి చేసుకోగా.. పవన్ కు విడాకులు ఇచ్చేశాక రేణు పూణేలో తన తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఉంటోంది. చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ – రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది.
గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకా స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ నటిస్తుండడంతో ఆమె పాత్ర ఎలా ? ఉండబోతుంది.. అన్నదానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రేణు హేమలత లవణం అనే పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఆమెపై నిర్మాతలు ప్లెజెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రేణు దేశాయ్ చాలా సింపుల్ గా నవ్వుతూ కనిపిస్తున్నారు.
అయితే రేణు దేశాయ్ ఈ సినిమాలో ఒక సామాన్య పౌరురాలుగా కనిపించబోతుందని.. ఆమె పాత్ర జర్నలిస్టు కోణంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ పాత్రతో రేణుదేశాయ్ టాలీవుడ్ లో చాలా గ్రాండ్‌గా రీఎంట్రీ దక్కుతుందన్న నమ్మకంతో ఆమె ఉంది. ఇక అక్టోబర్ 3న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుండగా.. దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతోంది.