సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా వింటూ వస్తున్నాం. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల గురించి ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి . తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది.
మనకు తెలిసిందే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు నాని . అక్కడి నుంచి స్టార్ హీరోగా మారి పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నాడు అంటే నాని ఎంత సత్తా గలమనిషో అర్థం చేసుకోవచ్చు . అయితే ఆయన తన క్లాస్మేట్ అంజనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నారు. చాలా చక్కగా ఉండే ఈ జంట మధ్య కూడా గొడవలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది .
ఒకానొక టైంలో వీళ్ళ మధ్య గొడవలు కారణంగా విడాకులు తీసుకోవాలని కూడా భావించారు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అయ్యాయి. నానికు తన భార్య అంజనా మీద అనుమానం ఉందని ..ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ తో ఎక్కువగా చనువుగా మూవ్ అవుతుందని.. ఆ కారణంగానే నాని విడాకులు తీసుకోవాలి అని అనుకుంటున్నాడు అంటూ అప్పట్లో కొందరు ఆకతాయిలు గాసిప్స్ క్రియేట్ చేశారు. నాని స్టార్ హీరో కావడంతో అవి సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయాయి. అయితే అదంతా కేవలం పుకారే అని నాని అంజనా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అని ఫ్రెండ్స్ క్లారిటీ ఇచ్చేశారు.