Moviesఆ ఒక్క రోజే జీవితాన్ని మ‌లుపు తిప్పిందా.. నాని ' స‌రిపోదా...

ఆ ఒక్క రోజే జీవితాన్ని మ‌లుపు తిప్పిందా.. నాని ‘ స‌రిపోదా శ‌నివారం ‘ … ఫ్యీజులు ఎగిరే కాన్సెఫ్ట్ ( వీడియో)

నేచురల్ స్టార్ నాని మరోసారి క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాని 31వ సినిమా కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివీ ఎంటర్టైన్మెంట్స్ పై డివిడి దానయ్య – కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దాన‌య్య త‌న డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లో నిర్మించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుని సంచ‌ల‌న రికార్డులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు స‌రిపోదా శ‌నివారం సినిమా అనౌన్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో.. అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా సరిపోదా శనివారం టైటిల్ మేకర్స్ రిలీజ్ చేశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో మేకర్స్ గ్లింప్స్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేశారు. సరిపోదా శనివారం అంటూ టైటిల్ ప్రకటించారు. సాయికుమార్ వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ గ్లింప్స్ వీడియో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది. మ‌న పెద్ద‌లు ఒక మాట‌నేవారు.. రాజుకైనా బంటుకైనా ఎలాంటి వాడికైనా ఒక రోజు వ‌స్తుంది… ఆ రోజు కోసం ఎన్ని రోజులైన ఎదురు చూడాల‌ని.. దానినే ఈ త‌రం వాళ్లు కాస్త మార్చి చెపుతున్నారు.

నీకంటూ ఒక టైం వ‌స్తుందిరా అందాక మూసుకుని వెయిట్ చేయ్ అంటున్నారు. ఆ ఒక్క రోజే శ‌నివారం.. వారానికి ఒక్క రోజు వ‌చ్చే శ‌నివారం స‌రిపోదా అన్న వాయ‌స్ ఓవ‌ర్ డైలాగ్ వినిపించింది. ఏదేమైనా ఒక్క రోజు .. అది కూడా శ‌నివారం ఎలాంటి సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంద‌న్న‌దే సినిమా స్టోరీగా తెలుస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా ప్రియాంక అరుల్‌ మోహన్ నటిస్తోంది. ప్రముఖ తమిళ సీనియర్ ద‌ర్శ‌కుడు ఎస్‌జె. సూర్య విల‌న్‌ నటిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news