Movies"హాయ్ నాన్న" టీజ‌ర్ వ‌చ్చేసిందోచ్.. ముద్దులతో చంపేసిన మృణాల్-నాని(వీడియో)..!!

“హాయ్ నాన్న” టీజ‌ర్ వ‌చ్చేసిందోచ్.. ముద్దులతో చంపేసిన మృణాల్-నాని(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “హాయ్ నాన్న”. ఈ సినిమాలో మృణాల్ ఆయనకు హీరోయిన్గా నటిస్తుంది . ఫుల్ టు ఫుల్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మూవీగా తెర్కెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది మూవీ టీం. ఈ క్రమంలోనే టీజర్ కూడా రిలీజ్ చేసింది .

మరీ ముఖ్యంగా నాని గత సినిమాలకు ఈ సినిమాలకు చాలా డిఫరెన్స్ ఉంది . రెండు పాత్రలో నాని మెప్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. కూతురు ప్రేమకు అమ్మాయి ప్రేమకు మధ్య సాగే ఈ కథ నాని కెరియర్ లోనే హైలెట్గా మారిపోతుంది. అంతేకాదు ఈ టీజర్ ఆధారంగా నాని వద్ద ఘాటు అయిన లిప్ లాక్, బెడ్ సీన్స్ ఉండబోతున్నాయి అంటూ తెలుస్తుంది . మరి ముఖ్యంగా నాని సెంటిమెంట్ ఈ సినిమాకు హైలెట్ కాబోతున్నాయి .

టీజర్ స్టార్టింగ్ లోనే డైలాగ్స్ అదరగొట్టేసాడు . “ప్లేట్లో ముగ్గులు వేస్తుందంటే ఏదో అయింది . ఏమైంది మా మై కుట్టి..?” అని అడగ్గా మా క్లాసులో వరుణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అంటూ చెబుతుంది ..ఆ పాప . ఈ డైలాగ్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . అంతేకాదు మొత్తానికి రొమాంటిక్ యాంగిల్ తీసుకొని నాని మృణాల్ ఈ సినిమాను మరో లెవెల్ లో చూపించబోతున్నారు అంటూ తెలిసిపోయింది . ఓ పక్క రొమాన్స్ మరోపక్క సెంటిమెంట్ రెండు సీన్స్ లోనూ నాని అద్భుతంగా నటించాడు . మొత్తానికి హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు నాని..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news