Newsనాని హీరోయిన్ల‌తో ఆ ప‌ని చేస్తే ఇంట్లో సంజ‌న చాకిరేవు పెట్టేస్తుందా.....

నాని హీరోయిన్ల‌తో ఆ ప‌ని చేస్తే ఇంట్లో సంజ‌న చాకిరేవు పెట్టేస్తుందా.. ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ నిజం..!

నేచుర‌ల్ స్టార్ నాని సినిమాలు కుటుంబ స‌మేతంగా చూసేలా ఉంటాయి. నాని సినిమాల‌లో రొమాన్స్‌, శృంగారం, హింస ఉన్నా కూడా అవి మితిమీరి ఉండ‌వు. అయితే ద‌స‌రా సినిమాతో నాని సినిమాల్లో వ‌యెలెన్స్ విష‌యంలో కాస్త గీత దాటిన‌ట్టుగా అనిపించింది. ఇప్పుడు హాయ్ నాన్న సినిమా విష‌యంలో ముద్దుల విష‌యంలో హ‌ద్దులు దాటేసిన‌ట్టుగా ఉంది.

హాయ్ నాన్న సినిమా టీజర్ లో కిస్సులు ఉన్నాయి.. ఇవి బాగా వైరల్ కావడంతో వీటిపై నాని స్పందించాడు. సినిమాలో కావాలని అలాంటి సన్నివేశాలు పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. నా గత సినిమాలు దసరా – అంటే సుందరానికి సినిమాల్లో లిప్ కిస్లు లేవు.. ఒకవేళ అలాంటి ముద్దు సీన్లు ఏమైనా ఉంటే ఇంటికెళ్లిన తర్వాత గొడవ అవుతుంది.. ఈ సంగతి పక్కన పెడదాం.. నాకు నేనుగా ముద్దు సీన్ల‌కు సంబంధించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను.. నా సినిమాల్లో ఎక్కడైనా సరదాగా పాటల్లోనూ.. లేదా సన్నివేశాలలోనూ లిప్ కిస్సులు పెట్టడం చూశారా ? కథ‌కు నిజంగా అవి అవసరం అనిపిస్తేనే ఉంటాయి లేదంటే అస్సలు ఒప్పుకోను అని తెలిపాడు.

నిజంగా డైరెక్టర్ విజన్ లో అలాంటి ముద్దు సీన్ ఏదైనా ఉంటే.. నేను దర్శకుడిని గౌరవిస్తాను అలాంటి సన్నివేశాలలో నటించడం నా బాధ్యత తప్పకుండా చేస్తాను అంటూ నాని చెప్పాడు. ఇక హాయ్ నాన్న సినిమాలో కూడా కథ డిమాండ్ చేసింది కాబట్టి కిస్ చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న సీక్వెల్స్ ట్రెండ్ పై కూడా నాని స్పందించాడు. ట్రెండ్ నడుస్తుంది కాబట్టే సీక్వెల్స్ చేసేయాలనే తాపత్రయం తనకు లేదని.. మంచి కథ సెట్ అయితే పిల్ల జమిందార్ – భ‌లే భ‌లే మగాడివోయ్ సినిమాలకు సిక్వెల్స్ చేయవచ్చు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news