Moviesలుక్ మార్చిన నటసింహం.. క్లీన్ షేవ్ తో కేక పెట్టిస్తున్న మన...

లుక్ మార్చిన నటసింహం.. క్లీన్ షేవ్ తో కేక పెట్టిస్తున్న మన బాలయ్య .. యంగ్ హీరోలు కూడా వేస్ట్..!!

వావ్ ఏమున్నాడు రా బాబు మన బాలయ్య .. ఇన్నాళ్ళు గుబురు గడ్డంతో .. పెద్దపెద్ద మీసాలతో కనిపించిన నటసిం హం నందమూరి బాలయ్య తాజాగా క్లీన్ షేవ్ చేసి అద్దిరిపోయే లుక్ లో దర్శనమిచ్చాడు . దీంతో నందమూరి బాలయ్య స్టైలిష్ ఫొటోస్ వైరల్ గా మారాయి . రీసెంట్ గా ఆయన నటించిన సినిమా భగవంత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అభిమానులను బాగా ఆకట్టుకుంది .

ఈ క్రమంలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకల్లో బాలయ్య పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ నయా లుక్ వైరల్ గా మారింది. ఎప్పుడు చూసినా గడ్డంతో మాస్ లుక్ లో కనిపించే బాలయ్య .. ఫస్ట్ టైం స్టైలిష్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎప్పుడు సాల్ట్ అండ్ పెప్పఎ లుక్ లో చూసి చూసి బోర్ కొట్టేసిన బాలయ్యను ..

ఈ కొత్త లుక్స్ లో చూడగానే నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు . బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన లుక్ కీసం బాలయ్య ఇలా మారిపోయాడా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీజన్ ఏదైన మన బాలయ్య ఈ లుక్ లో కేక పెట్టిస్తున్నాడు. దీంతో ఇదే లుక్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news