కేరిపరంగా మంచి ఫామ్‌లో ఉంది రష్మిక. ఇప్పటికే రెయిన్బో పేరిట ఓ సినిమా చేస్తున్నా ఈ నేషనల్ క్రష్మిక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది. ఆ సినిమా పేరు ది గర్ల్ ఫ్రెండ్. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బ్యాకెండ్ లో ఉన్నారు. ఆయన తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ జయరాజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. సినిమా అనౌన్స్మెంట్లో భాగంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రపంచంలో గ్రేట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి.. కానీ ఇప్పటివరకు ఎవరు చూడని.. వినని ప్రేమకథలు కూడా కొన్ని ఉంటాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అలాంటిదే అంటూ ఈ సినిమాపై స్పందించింది రష్మిక. ఇంతవరకు బాగానే ఉంది.. సింగర్ చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కలిసి కింగ్ నాగార్జునను మన్మధుడు 2 సినిమాతో నిండా ముంచేశారు.
మన్మధుడు 2 నాగార్జున కెరీర్ లోనే భయంకరమైన డిజాస్టర్. అసలు ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ కు ఛాన్స్ ఇవ్వాలని నాగార్జున అనుకోలేదు. కానీ తన అప్పటి కోడలు ( ఇప్పుడు మాజీ) సమంతకు సింగర్ చిన్మయి బెస్ట్ ఫ్రెండ్. సమంత ద్వారా నాగార్జునను లైన్లో పెట్టి మన్మధుడు 2 సినిమా ఛాన్స్ పట్టేశారు. మొగుడు, పెళ్ళాం కలిసి నాగార్జునను నిండా ముంచేశారు. ఈ సినిమాతో నాగార్జున పరువు ఘోరంగా పోయింది. అసలు మన్మధుడు 2 దెబ్బతో నాగర్జున మార్కెట్ మొత్తం ఢమాల్ అయింది.
ఆ దెబ్బకు రాహుల్ రవీంద్రన్‌ను ఎవరు ? దగ్గరకు కూడా రానివ్వట్లేదు. కనీసం ఊరు పేరు లేని హీరోలు కూడా రాహుల్ రవీంద్రను పట్టించుకోవట్లేదు. అలాంటి టైంలో ఏకంగా రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ ను పెట్టి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేయడం అంటే తెర వెనక సింగర్ చిన్మయి లేదా మొత్తానికి ఏదో బలమైన మతలబు అయితే జరిగిందన్న గుసగుసలు ఉన్నాయి. మరి నాగార్జునను నిండా ముంచేసిన ఈ భార్యాభర్తలు రష్మిక జీవితాన్ని ఏం చేస్తారో ? కాలమే సమాధానం చెప్పాలి.