Newsసిగ్గు విడిచి పెళ్ళికి ముందే సమంతను ఆ విషయం అడిగిన నాగార్జున..నాగచైతన్యను...

సిగ్గు విడిచి పెళ్ళికి ముందే సమంతను ఆ విషయం అడిగిన నాగార్జున..నాగచైతన్యను అడిగున్న బాగుండేది ఏమో..!?

నాగచైతన్య సమంత .. ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అక్కినేని ఇంటి వారసుడిగా నాగచైతన్య స్టార్ హీరోయిన్గా సమంత బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడంతో వీళ్ళిద్దరి పేర్లు హైలెట్గా మారాయి . అయితే పెళ్లి చేసుకున్న కొంతకాలానికే ఈ జంట విడాకులు తీసుకుని దూరం దూరంగా బ్రతుకుతున్నారు . వీళ్లు విడాకులు తీసుకున్న సరే వీళ్ళకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

కాగా ఈ క్రమంలోనే నాగచైతన్య సమంత గురించి ఇంట్లో చెప్పిన తర్వాత నాగార్జున సమంతను కొన్ని ప్రశ్నలు అడిగారట. అయితే ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు . నిజానికి నాగార్జున నాగచైతన్యకు వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నారు. ఆ మూమెంట్లోనే సమంత గురించి చెప్పి పెద్దలను ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు . అయితే సమంతను ఇంటి కోడలు చేసుకునే ముందు నాగార్జున ఓ విషయంలో సూటిగా ప్రశ్నించారట .

“సమంత .. నిజంగా మా అబ్బాయి అంటే ఇష్టమేనా..? మీ కల్చర్ వేరు మా కల్చర్ వేరు.. ఇద్దరు ఒకే ఫీల్డ్ లో ఉన్నారు.. కచ్చితంగా పెళ్లి తర్వాత సినిమాలు చేయాలి అంటున్నావ్ అప్పుడు మీ మధ్య ప్రాబ్లంస్ వస్తాయి.. ఫేస్ చేయగలరా ..? కోపాన్ని కంట్రోల్ చేసుకొని కాపురాని చేయగలరా..? ” అంటూ ప్రశ్నించారట . అఫ్కోర్స్ నాగార్జున అడిగిన ప్రశ్న మంచిదే కానీ ఈ ప్రశ్న నాగచైతన్యని అడుగుంటే ఇంకా బాగుండేది అంటున్నారు సమంత ఫ్యాన్స్ . ఎందుకంటే సమంత వెల్ మెచ్యూర్డ్ ఆమెకు అన్ని తెలుసు కానీ నాగచైతన్య అలా కాదు . ఒకరు చెప్పిందే నిజం అనుకునే టైప్ అంటూ సమంత ను పొగిడేస్తున్నారు. విడాకులు తీసుకున్న కూడా వీళ్ళ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి అంటే వీళ్ళపై జనాలకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news